NTR Dragon Glimpse: ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదరుచూసిన ‘డ్రాగన్’ సినిమా గ్లింప్స్ (NTR Dragon Glimpse) వచ్చేసింది. ఎన్టీఆర్ హీరోగా ‘కేజీఎఫ్, సలార్’ సినిమాలను తీసిన ప్రశాంత్‌నీల్ డైరెక్షన్‌లో రూపొందుతున్న సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ ఖరారైంది. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ‘డ్రాగన్’ సినిమా గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్‌లో ఎన్టీఆర్ చెప్పిన ఈ డైలాగ్స్ ఫ్యాన్స్‌ను, మాస్ ఆడియన్స్‌ను భలేగా ఆకట్టుకుంటున్నాయి.
అలాగే ‘డ్రాగన్’ గ్లింప్స్‌లోనే ‘డ్రాగన్’ సినిమా కథను చెప్పే ప్రయత్నం చేశాడు ప్రశాంత్‌నీల్. ఈ సినిమా కథ 1967 నేపథ్యంతో సాగుతుంది. మాధకద్రవ్యాల (హెరాయిన్) ఉత్పత్తి, అక్రమరవాణా నేపథ్యంతో ఈ ‘డ్రాగన్’ సినిమా ప్రధాన కథాంశం సాగుతుందని తెలుస్తోంది (Dragon story).
డ్రగ్స్ ఉత్పత్తి, అక్రమ రవాణాలో ముంబై కేంద్రంగా ఆప్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, కలకత్తా కేంద్రంగా గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ మధ్య వార్ నడుస్తుందని, ఈ వార్స్ నేపథ్యమే ‘డ్రాగన్’ సినిమా ప్రధాన కథాంశమని తెలుస్తోంది.ఏషియన్ ఇన్ చీఫ్ ఆఫ్ ఆప్ఘన్ ట్రేడింగ్ కంపెనీ లూజర్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నట్లుగా స్పష్టం అవుతోంది.
దేవుడు నాకు గొప్ప వరం ఇచ్చాడు..ట్రిగర్ నొక్కగానే మర్చిపోవడం….
నిదురపోయినప్పుడు నాకు నేను చంపిన వాళ్ల ముఖాలు రావు, మిగిలున్న శత్రువల ముఖాలే కనపడతాయి
పొరపాటున కూడా నా కల్లోకి రావొద్దు
నా డౌట్ ఏంటంటే…జలీల్ సాబ్, ఈ ముక్క హెరాయిన్ కంటే ఎక్కువగా విలన్స్‌ను తయారు చేస్తుందా?
ఈ కథలో అందరు విలన్సే ఉన్నారు
అన్న డైలాగ్స్ ‘డ్రాగన్’ గ్లింప్స్‌లో వినిపించాయి.
గ్యాంగ్‌స్టర్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తుండగా, భారత ప్రభుత్వానికి చెందిన నార్కొటిక్ హెడ్ ఆఫీసర్‌గా అనిల్‌కపూర్ నటిస్తున్నారు. హీరోయిన్‌గా రుక్మీణీ వసంత్ నటిస్తున్నారు. ఖుష్భూ, గురుసోమసుందరం రాజీవ్ కనకాల, అశుతోష్ రాణా వంటి వారు, ఈ ‘డ్రాగన్’ సినిమాలో ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తు న్నారు.
మైత్రీమూవీమేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై నందమూరి కళ్యాణ్‌రామ్, కొసరాజు హరికృష్ణ, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్‌లు ఈ ‘డ్రాగన్’ సినిమాను నిర్మిస్తున్నారు. ‘డ్రాగన్’ సినిమా వచ్చే ఏడాది జూన్ 11న (Dragon Release date) థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు రవిబస్రూర్ మ్యూజిక్ అందించారు.