పెద్ది ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ ఎంతంటే…!

Viswa
1 Min Read

Web Stories

Peddi Movie Collections: రామ్‌చరణ్‌ హీరోగా నటించిన పీరియాడికల్‌ స్పోర్ట్స్‌ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమా జూన్‌ 4న విడుదలైంది. బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో సుకుమార్‌ రైటింగ్స్, మైత్రీమూవీమేకర్స్‌ పతాకాలపై వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్‌ కిలారు ఈ సినిమాను నిర్మించారు. జూన్‌ 3న ఈ సినిమా పెయిడ్‌ ప్రీమియర్స్‌ను మేకర్స్‌ ప్రదర్శించారు. అయితే పెయిడ్‌ ప్రీమియర్స్‌తో కలుపుకుని, ఈ ‘పెద్ది’ సినిమాకు తొలిరోజు రూ. 136 కోట్ల రూపాయాల కలెక్షన్స్‌ వచ్చాయని మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు (Peddi Movie Collections). రీసెంట్‌ టైమ్స్‌లో తెలుగులో వచ్చిన వరుస సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద సరైన నంబర్స్‌ను నమోదు చేయలేకపోయాయి. ఈ తరుణంలో, పెద్ది సినిమా విడుదల కావడం, రూ. 100 కోట్ల రూపాయాల గ్రాస్‌ కలెక్షన్స్‌ సాధించడం అనేది ఓ మంచి పాజిటివ్‌ సైన్‌ అని, ఇండస్ట్రీ వాసులు భావిస్తున్నారు.

రామ్‌చరణ్‌ పెద్ది సినిమా రివ్యూ….ఊరి కోసం పెద్ది ఆట గెలిచాడా?

ఊరి ప్రజల కోసం పెద్ది తన ఆటతో చేసిన ఆత్మగౌరవ పోరాటం నేపథ్యంతో ‘పెద్ది’ సినిమా కథనం సాగు తుంది. ఈ చిత్రంలో జాన్వీకపూర్‌ హీరోయిన్‌ నటించగా, జగపతిబాబు, శివరాజ్‌కుమార్, బొమన్‌ ఇరానీ ఇతర ప్రధానపాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించారు.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi