Thandel Namo Namah Shivaya : నాగచైతన్య– సాయిపల్లవిల పెర్ఫార్మెన్స్‌ అదరహో…!

Viswa
1 Min Read

Web Stories

Thandel Namo Namah Shivaya: నాగచైతన్య, సాయిపల్లవి హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్‌ మూవీ ‘తండేల్‌’. ఈ లవ్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ మూవీకి చందూమొండేటి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ నుంచి ‘నమో నమః శివాయ’ (Thandel Namo Namah Shivaya) పాట లిరికల్‌ వీడియోను రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

సాంగ్‌ విజువల్స్, నిర్మాణ విలువలు ఈ పాటలో అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా సాయిపల్లవి, నాగచైతన్యల పెర్ఫార్మెన్స్‌లు ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి. జొన్నవిత్తుల సాహిత్యం, అనురాగ్‌ కులకర్ణి వాయిస్, దేవి శ్రీ మ్యూజిక్, శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ అన్నీ కుదిరాయి. మరి…తండేల్‌ మూవీకి ఈ సాంగ్‌ ఎంత కలిసొస్తుందో చూడాలి.

జాతర పాటలు ఉన్న ‘దేవర,క, కమిటీకుర్రాళ్ళు, పుష్ప ది రూల్‌’ సినిమా రీసెంట్‌ టైమ్స్‌లో సూపర్‌హిట్‌ అయ్యాయి. మరి..ఈ తరహా సెంటిమెంట్‌ ‘తండేల్‌’ సినిమాకూ కలిసొచ్చి, ఈ మూవీ సూపర్‌హిట్‌ అవుతుందా? లేదా అనేది చూడాలి. తండేల్‌ మూవీ ఫిబ్రవరి 7న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది.

వాస్తవ సంఘటనల ఆధారంగా…..

‘తండేల్‌’ (Thandel) సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందింది. విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్లోని మత్స్యకారులు జీవనోపాధికి గుజరాత్‌ తీరం వెళ్తారు. పొరపాటుగా పాకిస్తాన్‌ కోస్టల్‌ ఏరియాలోకి వెళ్లారు. దీంతో పాకిస్తాన్‌ నేవీ అధికారులు ఇండియన్‌ మత్స్యకారులను బంధీస్తారు. ఇలా బందీ కాబడిన ఓ వ్యక్తి జీవితం ఆధారంగానే ‘తండేల్‌’ సినిమా తీశారు. పెళ్లైన ఓ వ్యక్తి ఏడాది తిరగకముందే పాకిస్తాన్‌ చేతిలో బంది కాబడతాడు. ఆ వ్యక్తి భార్య గర్భవతి. అలాంటి సమయంలో అతని జీవితంలో ఎలాంటి సంఘ టనలు చోటుచేసుకున్నాయి? అన్న నేపథ్యంతో ‘తండేల్‌’ మూవీ ఎమోషనల్‌గా ఉంటుంది. 2018లో ఈ ఘటన జరిగింది.

Please Share
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi