సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో హీరోయిన్ ఐశ్వర్యారాజేష్ (Aishwarya Rajesh) పాపులారిటీ తెలుగులో అమాంతం పెరిగింది. ఈ సినిమా హిట్ తర్వాత ఐశ్వర్యారాజేష్ నటించిన తాజా సినిమా ‘ఓ..సుకుమారి’. ఇందులో తిరువీర్ (Thiru Veer) హీరోగా నటించారు. గతంలో తిరువీర్-ఐశ్వర్యారాయ్‌లు నాని హీరోగా నటించిన ‘టక్ జగదీష్’లో భార్యభర్తలుగా నటించారు. తాజాగా ఈ ఇద్దరు మెయిన్ లీడ్ రోల్స్‌గా చేసిన ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలైంది. మరి.. ఈ సినిమా ఆడియన్స్‌ను మెప్పించిందా? తిరువీర్‌కు మంచి హిట్ పడిందా? ఐశ్వర్యా రాజేష్ తన మ్యాజిక్‌ను రిపీట్ చేయగలిగిందా? రివ్యూలో చదవండి
సినిమా: ఓ..! సుకుమారి(Oh..! Sukumari Review)
ప్రధాన తారాగణం తిరువీర్, ఐశ్వర్యారాజేష్, మురళీధర్ గౌడ్, ఝాన్సీ, శరణ్య, శ్రీనివాస్ గవిరెడ్డి, ఆనంద్
దర్శకుడు భరత్ దర్శన్
నిర్మాత మహేశ్వరరెడ్డి మూలి
సంగీతం భరత్ మంచిరాజు
కెమెరా సీహెచ్ కుషేందర్
విడుదల తేదీ 2026 జూలై 17
నిడివి: 2 గంటల 17 నిమిషాలు
రేటింగ్ 2/5
Oh..! Sukumari Story కథ
ఊరికి సర్పంచ్ కావాలన్నది యాదగిరి ఆశయం. ఇలా సర్పంచ్ కావాలన్న తన ఆకాంక్షను నేరవేర్చు కునేందుకు కష్టపడుతుంటాడు . ఓ సారి ఓడిపోతాడు. యాదగిరికి ఒక తమ్ముడు (శ్రీనివాస్ గవిరెడ్డి) ఉంటాడు. సడన్‌గా యాదగిరి తాతయ్య చనిపోతాడు. అయితే తన ఇద్దరు మనవళ్లలో ఎవరు ముందుగా మగబిడ్డకు జన్మనిస్తారో, అతనికి తన 80 ఏకరాల ఆస్తి చెందుతుందని ఈ విల్లులో ఉంటుంది. ఈ క్రమం లో పెళ్లిచూపుల కోసం చంద్లాపూర్ గ్రామానికి వెళ్లిన యాదగిరి, అక్కడ దామిని (ఐశ్వర్యారాజేష్)ను చూసి, ఇష్టపడతాడు. దామినిని వివాహం చేసుకుంటాడు. కానీ దామినికి ఒక సమస్య ఉంటుంది. అదేం టంటే…దామిని కాస్త ఎమోషనల్ అయినప్పుడు, ఆమెను ఎవరైనా ముట్టుకున్నా, ఆమె ఎవర్నైనా తాకినా షాక్ కొడుతుంది. ఈ విషయం పెళ్లి తర్వాత యాదగిరికి తెలుస్తుంది. మరి..ఆ తర్వాత ఏం జరిగింది?యాదగిరి–దామిని దంపతులకు వారసుడు జన్మించాడా? దామినికి ఉన్న ఎలక్ట్రికల్ షాక్ సమస్య ఎలా సాల్వ్ అయ్యింది? అన్నది మిగిలిన కథాంశం.(Oh..! Sukumari Review in telugu)

విశ్లేషణ
చాలా రెగ్యులర్ అండ్ రోటీన్ సినిమా ఇది. హ్యూమన్ బాడీలో ఎలక్ట్రిక్ షాక్ అనే ఒక కొత్త కాన్సెప్ట్‌తో దర్శకుడు ఈ సినిమాను తీశాడు. ఈ పాయింట్ బాగానే ఉన్నా, సినిమా అంతా ఇదే పాయింట్ మీద కొనసాగడం అనేది ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. ఈ అంశం చుట్టూ దర్శకుడు సరైన భావోద్వేగాలతో కూడిన డ్రామాను రక్తికట్టించడంలో విఫలమైయ్యాడు. పెళ్లి సమయంలో ఎలక్ట్రికల్ షాక్ కొట్టకపోవడం, క్లైమాక్స్‌లో ఓ సన్నివేశంతో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ కావడం అనేది కన్విన్సింగ్ లేదు. అసలు..హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్ కాన్ఫ్లిక్ట్ సర్పంచ్ కావడమే. హీరోయిన్ కూడా ఎన్నికల ప్రచారం చేసే సీన్ ఉంది. కానీ ఈ సర్పంచ్ ఎన్నికల ప్రస్తావనే సెకండాఫ్‌లో ఉండదు. కుటుంబ భావోద్వేగాలతో కూడిన సన్నివేశాల్లో కొత్తదనం లేకపోగ, బోరింగ్‌గా అనిపిస్తాయి. కొన్ని సన్నివేశాలు ఇదివరకు చూసిన ఫీలింగ్‌ను కలిగిస్తాయి. ప్రేక్షకులు ఊహించదగ్గ స్క్రీన్ ప్లేనే తెరపై ప్రదర్శితమౌతుంటుంది. చాలా చోట్ల ఆడియన్స్‌కు షాక్ కొడుతుంది. ఎంత పెద్ద స్టార్ యాక్టర్ అయినా సరే..కథలో కొత్తదనం ఉంటేనే ఆడియన్స్ చూస్తున్న నేటి కాలంలో ఇలాంటి పాతరకం కంటెంట్‌తో ఆడియన్స్‌ను మెప్పించాలనే దర్శకుడి సాహసానికి హ్యాట్సాఫ్ చెప్పాలి.
ఉన్నంతలో ఒకట్రెండు కామెడీ సీన్స్, ఒక ఎమోషనల్ సీన్ ఒకే అనిపిస్తుంది. ఇటీవల తిరువీర్ హీరోగా నటించిన ‘పాపం..ప్రతాప్’, విష్ణువిశాల్ ‘మట్టికుస్తీ’ సినిమాల్లోని కొన్ని సీక్వెన్స్‌లు గుర్తొస్తాయి (Oh..! Sukumari Telugu Review)
నటీనటుల పెర్ఫార్మెన్స్
తిరువీర్ ఎప్పట్నాలనే తన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ చేశాడు. ఫర్వాలేదనిపించాడు. ఇక దామని పాత్రలో ఐశ్వర్యారాజేష్ బాగానే చేశారు. కానీ ఈ తరహా పాత్రలు ఆమె కెరీర్‌కు ప్లస్ కాకపోవచ్చు. అయితే ఈ సినిమాకు హార్ట్‌లాంటి దామని పాత్రలో ఐశ్వర్యారాజేష్ నటన మెప్పిస్తుంది. హీరోయిన్ తండ్రి చంద్రయ్యగాఆనంద్, చంద్లాపూర్ గ్రామ సర్పంచ్‌గా మురళీధర్ గౌడ్, చెన్నై ఫోటో గ్రాఫర్‌గా విష్ణు ఓయ్, ఝాన్సీ, హీరో తమ్ముడు పాత్రలో శ్రీనివాస్ గవిరెడ్డి, విలన్‌గా జీవన్ వారి వారి పాత్రల పరిధిమేరకు నటించారు. ఎంచుకున్న పాయింట్‌ను ఎగ్జిక్యూట్ చేయడంతో దర్శకుడు భరత్ దర్శన్ తడబడ్డాడు. తొలి సినిమాగా పరంగా చూసుకుంటే అతను ఒకే. కానీ కథలోని రోటీన్ డ్రామా ఉండటం చాలా మైనస్. నిర్మాత మహేశ్వర రెడ్డి మూలి కాస్త జాగ్రత్తగానే చూసి, ఖర్చుపెట్టినట్లు ఉన్నాయి. నిర్మాణ విలువలే ఒకే. భరత్ మాంచిరాజు సంగీతం సినిమాకు ప్లాస్ కాకపోయింది. కుషేందర్ విజువల్స్ యావరేజ్‌గా ఉన్నాయి. ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ థియేటర్స్‌కు వెళితే, తప్పకుండ షాక్ కొడుతుంది.
