డ్రాగన్‌ సినిమా కోసం ఓవర్‌ రిస్క్‌ చేస్తున్న ఎన్టీఆర్‌?

Viswa
2 Min Read

Web Stories

NTR Taking Huge Risk for Dragon: ఎన్టీఆర్‌ ఒక హీరోగా చేసిన హిందీ ‘వార్‌ 2’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమా కంటే ముందు ఎన్టీఆర్‌ సోలో హీరోగా చేసిన ‘దేవర’ ఓ మోస్తారు హిట్‌గానే నిలిచింది. దీంతో ‘డ్రాగన్‌’ సినిమాతో ఎలాగైనా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టాలనే లక్ష్యంతో తీవ్రంగా శ్రమిస్తున్నారు ఎన్టీఆర్‌.

ఈ సినిమా కోసం ఇప్పటికే చాలా కఠినమైన మేకోవర్‌ అయ్యారు ఎన్టీఆర్‌. బాగా సన్నబడిపోయారు. ఇందు కోసం కఠినమైన కసరత్తులు, డైట్‌ ఫాలో అయ్యారు ఆయన. ఈ దశలో ఎన్టీఆర్‌కు కాస్త ఆరోగ్యపరంగా ఇబ్బందులు కూడా ఎదుౖరైయ్యాయని, ఒక దశలో ‘ఇక డైల్‌ ఫాలో కావొద్దని’ తాను చెప్పిన ఎన్టీఆర్‌ విన కుండ, సినిమా కోసం సన్నబడ్డారని ప్రశాంత్‌నీల్‌ చెప్పిన సంగతులు గుర్తుండే ఉంటాయి. ఇప్పుడు మరోమారు ఈ ‘డ్రాగన్‌’ సినిమా కోసమే ఎన్టీఆర్‌ రిస్క్‌ చేశారనే వార్తలు వస్తున్నాయి.

‘కేజీఎఫ్, సలార్‌’ సినిమాల ఫేమ్‌ ప్రశాంత్‌నీల్‌ డైరెక్షన్‌లో ఎన్టీఆర్‌ హీరోగా చేస్తున్న పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా ‘డ్రాగన్‌’. హైదరాబాద్‌లో రామోజీ ఫిల్మ్‌ సిటీ స్టూడియోలో కొన్ని రోజులుగా ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. నైట్‌ షూట్‌లో లో ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ తీస్తున్నారు ప్రశాంత్‌నీల్‌. ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌లో భాగంగానే ఎన్టీఆర్‌కు గాయమైందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. ఆరు వారాల నుంచి ఎనిమిది వారాల విశ్రాంతి అనంతరం ఎన్టీఆర్‌ పూర్తి స్థాయిలో కోలుకుంటారని వైద్యులు చెప్పారని, ఎన్టీఆర్‌ సిబ్బంది పేర్కొ న్నారు.

కేవలం ఒక సినిమా కోసమే ఎన్టీఆర్‌ ఇలా పలుమార్లు తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం, ఆయన అభి మానులకు మాత్రం రుచించండం లేదు. ‘డ్రాగన్‌’ సినిమా కోసం ఎన్టీఆర్‌ ఓవర్‌ రిస్క్‌ చేయాల్సిన అవసరం లేదని కొందరు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా ‘డ్రాగన్‌’ సినిమా వచ్చే ఏడాది జూన్‌ 11న రిలీజ్‌ కానుంది. నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్, కల్యాణ్‌రామ్, కొసరాజు హరికృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రుక్మిణీ వసంత్, అనిల్‌కపూర్‌ ఈ సినిమాలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

 

Please Share
Share This Article
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu