రష్మికా మందన్నాకు గాయం..ఆరు వారాల రెస్ట్‌

Viswa
1 Min Read

Web Stories

 Rashmika Mandanna: ప్రముఖ హీరోయిన్‌ రష్మికా మందన్నా Rashmika Mandanna) గాయపడ్డారు. ఓ డ్యాన్స్‌ సీక్వెన్స్‌ చిత్రీకరణలో భాగంగా రష్మికా మందన్నాకు గాయమైంది. ‘రణబాలి’, ‘మైసా’ సినిమాల వరుస చిత్రీకరణలకు సంబంధించిన యాక్షన్, డ్యాన్స్‌ సీక్వెన్స్‌ల కోసం రష్మికా మందన్నా చేసిన సాధన, సెట్స్‌లో ఆమె పెర్ఫార్మెన్స్‌ ఈ గాయాలకు కారణాలుగా కనిపిస్తున్నాయి. రష్మికామందన్నా హిప్‌ ఏరియాలో టెండన్‌ డిటాచ్‌మెంట్‌ జరిగింది. దీంతో ఆమెకు వైద్యులు 6 నుంచి 8 వారాల విశ్రాంతి సూచించారు. దీంతో రష్మికా మందన్నా పాల్గొంటున్న నాలుగు సినిమాల చిత్రీకరణపై ప్రభావం పడుతుందని ఆమె సిబ్బంది పేర్కొంది. అలాగే రష్మికా మందన్నా దాదాపు 30 వ్యాపార ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ఉత్పత్తుల యాడ్‌ షూటింగ్స్‌ సైతం నిలిపోనున్నాయి.

మరోవైపు రష్మికా మందన్నా గాయపడటం ఇటీవలి కాలంలో ఇది రెండోసారి. గత ఏడాది ఫిబ్రవరిలో ‘ఛావా’ సినిమా చిత్రీకరణ సమయంలో రష్మికా మందన్నా గాయపడ్డారు. ఆ సమయంలో కాలికి దెబ్బ తగిలినప్పటికీని, ఆమె ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొని, అందర్నీ ఆర్యశ్చపరిచారు. ఇంకోవైపు గాయం నుంచి రష్మికా మందన్నా కోలుకోవాలని ఆమె అభిమానులు సమాజిక మాధ్యమాల వేదికగా పోస్ట్‌లు చేస్తున్నారు.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu