రామాయణ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Kumar NA
1 Min Read

Web Stories

Ramayana movie Release date: ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘రామాయణ’ సినిమా  (Ramayana Movie) విడుదల తేదీ ఖరారైంది. హిందీ ‘రామాయణ’ సినిమా నవంబరు6న రిలీజ్‌ కానుంది. ‘రామాయణ’ సినిమా రెండు పార్టులుగా రిలీజ్‌ కానున్న నేపథ్యంలో ‘రామాయణ పార్టు 1’ సినిమా నవంబరు 6న రిలీజ్‌ కానుంది. మలిభాగం వచ్చే ఏడాది దీపావళి సందర్భంగా రిలీజ్‌ కానుంది. ఇప్పటికే తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మలయాళం భాషల్లో ‘రామాయణ పార్ట్‌ 1’ ట్రైలర్‌ను రిలీజ్‌ చేయగా, తాజాగా ఇంగ్లీష్‌ వెర్షన్‌ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. రామాయణ పార్టు 1 సినిమా ఇంటర్‌నేషనల్‌ వెర్షన్‌ను సోనీ పిక్చర్స్‌ సంస్థ ఇండియా అవతలి దేశాల్లో రిలీజ్‌ చేస్తుండగా, కరణ్‌జోహార్‌కు చెందిన ‘ధర్మ ప్రొడక్షన్స్‌’ సంస్థ ‘రామాయణ’ పార్టు 1 సినిమాను ఇండియాలో రిలీజ్‌ చేస్తోంది.నితీష్‌ తివారి దర్శకత్వం వహించారు.

ఈ తాజా హిందీ రామాయణ సినిమాలో రాముడిగా రణ్‌బీర్‌కపూర్, సీతగా సాయిపల్లవి, లక్ష్మణుడిగా రవి దుబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్, శూర్ఫణకగా రకుల్‌ప్రీత్‌సింగ్, మండోదరిగా కాజల్‌ అగర్వాల్‌ నటించారు. నమిత్‌ మల్హోత్రా, యశ్‌ ఈ ‘రామాయణ’ సినిమాను నిర్మిస్తున్నారు. దాదాపు 4 వేల కోట్ల రూపాయల బడ్జెట్‌తో ‘రామాయణ’ సినిమా రెండు పార్టులను తెరకెక్కిస్తున్నట్లుగా నమిత్‌ మల్హోత్రా తెలిపారు. అలాగే ‘రామాయణ పార్టు 2’కు సంబంధించి ఇప్పటికే యాభైశాతం షూటింగ్‌ పూర్త యినట్లు ఇటీవల ఓ సందర్భంగా రణ్‌బీర్‌కపూర్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu