TheParadise Teaser: నాని హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘ది ప్యారడైజ్’ (The Paradise teaser). నానితో ‘దసరా’ సినిమా చేసి, దర్శకుడిగా తొలి సినిమాతోనే హిట్ అందుకున్న శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు దర్శకుడు. ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తొలుత మార్చి 26నే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆగస్టు 21కు రిలీజ్ డేట్ మార్చారు. తాజాగా సెప్టెంబరు 24న ‘ది ప్యారడైజ్’ (the Paradise release date) సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
‘ది ప్యారడైజ్’ టీజర్ చూస్తుంటే…జడల్ క్యారెక్టర్లో నాని ఫుల్ అగ్రెసివ్‌గా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.
‘అణచివేయబడ్డ మన జాతి బలపడాలి’,
‘ఛీ..చీదరించుకున్న నలుపురంగే మన జెండా..కాకే దాని మీద గుర్తు..’,
‘తూ..అనిపించుకున్న కాకులు తల్వార్లు పడితే ఏమైతదో చూపిద్దాం…’,
‘ఈ జాగా ఎవరిది?’, ‘మనది’, ‘ఈ దేశం ఎవరిది?’, ‘మనది’,
‘‘ఇరుగుదిష్టి..పొరుగు దిష్టి..నల్లిగుడ్లోని దిష్టి..బెదురుగుడ్లోని దిష్టి…కత్తులన్నీ కటకట..నెత్తురంతా చిటపట..దిష్టంతా పోవాలే..!తూ..తూ..తూ..’’
…వంటి డైలాగ్స్ ఈ సినిమా టీజర్లో ఉన్నాయి.
కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అనిరు«ద్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
it is a fine-internet site