Ramba Oorvasi Menaka Teaser: అల్లరి నరేశ్ (AllariNaresh), సురభి, రాశిసింగ్, విష్ణు ప్రియ, ప్రిషా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘రంభ ఊర్వశి మేనక’ ( Ramba Oorvasi Menaka Teaser news) . చంద్ర మోహన్ చింతడ దర్శకత్వంలో నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 4న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్లో ఈ కింది డైలాగ్స్ ఉన్నాయి.
వారణాసి…రుద్ర చేసే కాలాతీత ప్రయాణం
ఇది మన ఫ్యామిలీకి సంబంధించిన మ్యాజిక్ బుక్ రా..!
‘బుక్ మీద కరెక్ట్‌గా ముగ్గు వేయాలి..’,
‘ఆ ముగ్గు గీస్తే రంభ..ఊర్వశి..మేనకలు కిందికి దిగుతారా…?’,
‘దిగుతార్రా…’
‘నేను హీరో అవ్వాలని కోరుకుంటే….’,
‘రంభ వచ్చి తథాస్తు..అంటే అమితాబ్‌బచ్చన్, రజనీకాంత్, చిరంజీవి…వీళ్లందరి కంటే పెద్ద హీరో అయిపోతారా…’
‘దేవతలపై రాజైన అయిన ఈ ఇంద్ర ప్రజాపతిని వణికిస్తున్నవాడు..ఎవడు మహేంద్ర…’’
‘ఒక మానవుడు..’
‘ఎనిమిదింటికి రంభ వస్తుంది..’..
‘చిప్ దొబ్బింది…’
అన్న డైలాగ్స్ ఈ సినిమా టీజర్లో ఉన్నాయి.
వన్ డే బ్రేక్…వైజాగ్‌లో అల్లు అర్జున్
కొన్ని వరుస సిరీయస్ సినిమాల తర్వాత ‘అల్లరి’ నరేశ్ హీరోగా రూపొందిన కామెడీ సినిమా ఇది. మరి..ఈ సినిమాతో మరో హిట్‌ను అల్లరి నరేశ్ తన ఖాతాలో వేసుకుంటారా? లేదా? అనేది చూడాలి.