ది రాజాసాబ్‌ బాటలోనే ఫౌజి?

Viswa
1 Min Read
Prabhas Fauzi Release for sankrathi2027

Web Stories

Prabhas Fauzi release: ప్రభాస్‌ ‘ఫౌజి’ సినిమా షూటింగ్‌ ఎప్పట్నుంచో జరుగుతోంది. ఇటీవల ‘ఫౌజి’ చిత్రాన్ని ఈ ఏడాది దసరా సందర్భంగా రిలీజ్‌ అని మేకర్స్‌ ప్రకటించారు. కానీ దసరా రిలీజ్‌ సాధ్యపడలేదు. ఆ తర్వాత డిసెంబరు 3న ఫౌజి రిలీజ్‌ అంటూ ఓ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు మేకర్స్‌. కానీ ఆ తర్వాత డిసెంబరు 4న నాగచైతన్య ‘వృషకర్మ’, విశ్వక్‌సేన్‌ ‘లెగసీ’ సినిమాల రిలీజ్‌ డేట్స్‌ను గురించిన ప్రకటనలు వచ్చాయి. దీంతో ‘ఫౌజి’ సినిమా రిలీజ్‌ వాయిదా కనుకనే,‘వృషకర్మ’, ‘లెగసీ’ సినిమాల రిలీజ్‌డేట్స్‌ డిసెంబరు 4కు ఫిక్స్‌ అయ్యాయని, సంక్రాంతికి ‘ఫౌజి’ సినిమా రిలీజ్‌ కావొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే.. ‘ది రాజాసాబ్‌’ బాటలోనే ‘ఫౌజి’ ప్రయాణం సాగుతున్నట్లే అనుకోవచ్చు.

‘ది రాజాసాబ్‌’ సినిమాను తొలుత ఏప్రిల్‌ 10, 2025న రిలీజ్‌ అంటూ ప్రకటించారు. ఆ తర్వాత డిసెంబరు 5న రిలీజ్‌ అని మరో రిలీజ్‌ డేట్‌ ప్రకటించారు. ఫైనల్‌గా సంక్రాంతి సందర్భంగా జనవరి 9, 2026న రిలీజ్‌ చేశారు. ఇలా డిసెంబరు నుంచి ‘ది రాజాసాబ్‌’ సినిమా రిలీజ్‌ సంక్రాంతికి షిఫ్ట్‌ అయ్యింది. మరి…రిలీజ్‌ పరంగా ‘ది రాజాసాబ్‌’ బాటలోనే ‘ఫౌజి’ ప్రయాణం కూడా సాగుతున్నట్లుగా తెలుస్తోంది. మరి..రిజల్ట్‌ ఏంటి అనేది ఆడియన్స్‌ చూసుకుంటారు. ‘సీతారామం’ ఫేమ్‌ హనురాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజి’ సిని మా తెరకెక్కుతోంది.

 

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu