Vishwaksen cult Movie: నిజ జీవితంలో జరిగిన కొన్ని కలవరపెట్టే సంఘటనల నేపథ్యంతో రూపొందిన సినిమా ‘హ్యాష్‌టాగ్ కల్ట్’ (Vishwaksen cult Movie) . విష్యక్సేన్ ఈ సినిమాలోని ప్రధాన పాత్రలో నటిస్తుండటంతో పాటుగా, స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తు న్నారు. గాయత్రి భరద్వాజ్ హీరోయిన్గా చేస్తున్నారు. తారక్ పొప్నప్ప, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సందీప్ కాకరాల కూడా నిర్మాతగా బాధ్యతలు నిర్వర్తిస్తు న్నారు. తాజాగా ఈ సినిమాను అక్టోబరు 30న (Vishwaksen cult Movie Release date) రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఓటీటీలో అగధ…స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
కథలో యూనివర్సల్ అప్పీల్ ఉండటంతో, ఈ సినిమాను తెలుగు, హిందీ, ఇంగ్లీష్, జపనీష్, స్పానిష్ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నట్లుగా యూనిట్ పేర్కొంది. డార్క్ అండ్ ఇంటెన్స్ థ్రిల్లర్‌గా కల్ట్ మూవీ ప్రేక్షకులను అలరిస్తుందని, ఇందులో విష్యక్సేన్ క్యారెక్టర్లో నెగటివ్ షేడ్స్ ఉంటాయని కూడా యూనిట్ తెలిపింది.