సందీప్‌కిషన్‌ సిగ్మా మూవీ రివ్యూ..రూ. 1000 కోట్ల లాకర్‌ కీ ఎక్కడ?

Viswa
2 Min Read
Sundeep kishion Sigma movie Review

Web Stories

Sigma Movie Review: సినిమా:సిగ్మా
నటీనటులు: సందీప్‌కిషన్, ఫరియా అబ్దుల్లా, సంపత్‌రాజ్, రాజు సుందరం, శివ్‌ పండిట్, కిరణ్‌ కొండ
నిర్మాణం: లైకా ప్రొడక్షన్స్, సుభాస్కరన్‌
దర్శకుడు: జేసన్‌ సంజయ్‌
నిడివి: 2 గంటల 26 నిమిషాలు
సంగీతం: తమన్‌
సినిమాటోగ్రఫీ: కృష్ణన్‌ వసంత్‌
రేటింగ్‌: 1.75/5

కథ

గురు (సందీప్‌కిషన్‌) లైబ్రరీ రన్‌ చేస్తుంటాడు. ఈ ఆధునిక యుగంలో పుస్తకాలు చదివేవాళ్ళు తక్కువై య్యారు. దీంతో యూట్యూబ్‌లో స్టోరీ టెల్లర్‌గా ఫేమసై, డబ్బు సంపాదించాలనుకుంటాడు. కానీ గురు నాన్న చేసిన అప్పులవల్ల లైబ్రరీని వదులుకోవాల్సిన పరిస్థితి. లైబ్రరీని కోల్పోకుండా ఉండాలంటే గురుకి ఒక్కరోజులో రూ.1.25 కోటి డబ్బులు కావాలి. ఏం చేయాలో తెలియక విన్సెంట్‌ (శివ పండిట్‌) నిర్వహించే గ్యాబ్లింగ్‌లో పాల్గొని, ఉన్న డబ్బును కూడా కోల్పోతాడు. అయితే ఇదే సమయంలో విన్సెంట్‌ అక్రమ వ్యాపారాలకు సంబంధించిన ఓ వీడియో ఉన్న పెన్‌డ్రైవ్‌ గురు చేతికి చిక్కుతుంది. అలాగే ఇంటర్‌నేషనల్‌ మాఫియా లీడర్‌ వీరయ్య రెడ్డి (సంపత్‌ నంది)కి చెందిన రూ. 1000 కోట్ల బ్లాక్‌మనీకి చెందిన లాకర్‌ కీ ఈ పెన్‌డ్రైవ్‌తోనే ముడిపడి ఉంటుంది. మరి..గురు ప్రాబ్లమ్‌ ఈ పెన్‌డ్రైవ్‌తో సాల్వ్‌ అయ్యిందా? వీరయ్య
తన బ్లాక్‌మనీని కాపాడుకోగలిగాడా? గురుకి ఆర్‌జే సామ్‌ (ఫరియా అబ్దుల్లా) నీల్‌ (రాజు సుందరం)లు ఏ విధంగా సాయం చేశారు? అన్నదే మిగిలిన కథాంశం (Sigma Movie Review).

విశ్లేషణ

తెల్లకాగితం సినిమా రివ్యూ…టీనేజ్‌లో తెలియక తప్పుచేస్తే…?

తమిళనాడు ముఖ్య మంత్రి హీరో దళపతి విజయ్‌ తనయుడు జాసన్‌ సంజయ్‌ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. గ్యాబ్లింగ్, క్యాసినో, బ్లాక్‌మనీ, మాఫియా, యూట్యూబ్‌ స్టోరీటెల్లింగ్, మనీ హై యిస్ట్‌..ఇవన్నీ లేటెస్ట్‌ టెండ్‌కు తగ్గట్లు ఉన్నా, కథ మాత్రం చాలా అంటే చాలా ఓల్డ్‌. స్క్రీన్‌ ప్లే కానీ, కథలో వచ్చే మలుపులు కానీ, ట్విస్ట్‌లు కానీ ఆడియన్స్‌ను ఏమాత్రం ఎగై్జట్‌ చేయక పోగా, బాగా బోర్‌ ఫీల్‌ అయ్యే లా చేస్తాయి. విలన్స్‌ మైండ్‌ గేమ్స్, హీరో డబ్బును సొంతం చేసుకోవాలని ప్లాన్‌ వేయడం, మదర్‌ సెంటి మెంట్‌ ఏదీ వర్కౌట్‌ అయినట్లు అనిపించదు. హీరో క్యారెక్టరైజేషన్‌తో ఆడియన్స్‌ ట్రావెల్‌ కాలేకపోయారు. ఎందుకంటే ఆ ఎమోషనల్‌ కనెక్ట్‌ గురు క్యారెక్టర్‌తో ఆడియన్స్‌కు లభించదు. కథలానే క్లైమాక్స్‌ కూడా కొత్తగా అనిపించదు.

నటీనటుల పెర్ఫార్మెన్స్‌

యాక్టర్‌గా సందీప్‌కిషన్‌ తనలోని కొత్త యాంగిల్‌ను బయటకుతీసిన సినిమా ఏం కాదు ఇది. రోటిన్‌ స్టైల్‌ ఆఫ్‌ యాక్టింగ్‌ అని చెప్పవచ్చు. ఫరియా పాత్రకు పెద్ద స్కోప్‌ లేదు. శివ్‌ పండిట్, సంపత్‌రాజ్‌లవి రొటీన్‌ విలన్‌ పాత్రలే. అన్భుదాసన్, రాజుసుందరం…వాళ్ల పరిధిమేరకు యాక్టింగ్‌ చేశారు. జాసన్‌ సంజయ్‌ కథలో కొత్తదనం లేదు. బలమైన నాటకీయత లేదు. కథలో భావోద్వేగాలకు ప్రాముఖ్యత లేదు. తమన్‌ మ్యూజిక్‌ ఇంపాక్ట్‌ చేయలే కపోయింది. లైకా సంస్థ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటింగ్‌ యావరేజ్‌.

ఫైనల్‌గా.. ట్రెండీ టైటిల్‌…ఓల్డ్‌ అండ్‌ అవుట్‌డైటేడ్‌ స్టోరీ

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu