Husharu2 Movie: దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం వచ్చిన యూత్‌ఫుల్ మూవీ ‘హుషారు’ మంచి సక్సెస్ కొట్టింది. శ్రీహర్ష కొనుగంటి ఈసినిమాకు దర్శకత్వం వహించారు. మళ్లీ ఇప్పుడు ‘హుషారు 2’ సినిమాకు స్టార్ట్ చేసి, షూటింగ్‌ను కూడా చివరి దశకు తీసుకువచ్చారు దర్శకుడు శ్రీహర్ష.
సీక్వెల్లో రాహుల్ రామ కృష్ణ, అశోక్ గల్లా, రవి అంథోని, దినేష్ తేజ్, శశిధర్ కోచర్లకోట, విధి యాదవ్, అభిజ్ఞ ఉతులూరు, భగవాన్ తివారి, జతిన్ గోసామి, రజయ్ రోవన్ మెయిన్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేస్తామని యూనిట్ పేర్కొంది. ‘‘డబుల్ ఫన్, డబుల్ ఎంటర్టైన్మెంట్ వినోదంతో ప్రేక్షకులను మా చిత్రం అలరించనుంది’’ అని యూనిట్ చెబుతోంది.