పెద్ద దర్శకులే ఇలా చేస్తే ఎలా?

Viswa
2 Min Read
ఫిల్మ్‌ ప్రొడక్షన్‌లో పెద్ద దర్శకులు సైతం ఫెయిల్‌ అవుతున్నారా?. ఏకంగా ఆర్టిస్టుల వెర్షన్స్‌నే లేపేస్తున్నారా?

Web Stories

Film Production Control: మారిన పరిస్థితుల దృష్ట్యా ఫిల్మ్‌మేకింగ్‌ చాలా ఖరీదుగా మారిపోయింది. రోజువారి ప్రొడక్షన్‌ కాస్ట్‌ను ఎలా కంట్రోల్‌ చేయాలో తెలియక నిర్మాతలు తర్జనభర్జనలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో కొంతమంది దర్శకులు కనీసం తమవంతు బాధ్యతను నిర్వర్తించడంలో విఫలం అవుతూ, నిర్మాతలకు మరింత కష్టాన్ని తెచ్చిపెడుతున్నారు. అనవసరమైన సన్నివేశాలను చిత్రీకరిస్తూ, సినిమా ఖర్చును పెంచేస్తున్నారు. ఇంకొంత మంది దర్శకులు అయితే, ఏకంగా ఆర్టిస్టుల వెర్షన్స్‌నే లేపేస్తున్నారు.

వెంకటేశ్‌ హీరోగా చేసిన ‘ఆదర్శకుటుంబం’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా రిజల్ట్‌ ఎలా ఉందన్న విషయం పక్కన పెడితే…ఇందులోని కొన్ని కీలక సన్నివేశాల కోసం వెన్నెల కిషోర్‌ను తీసుకున్నారు. కొంత షూట్‌ జరిగింది. కానీ సినిమాలో వెన్నెల కిషోర్‌ పాత్రే లేదు. అంతేనా…ఈ సినిమా కోసం షూట్‌ చేసిన ‘మాలా వచ్చా..’ పాట సైతం స్క్రీన్‌పై కనిపించలేదు. త్రివిక్రమ్‌ (Director Trivikram) ఈ సినిమాకు దర్శకుడు. ఇక ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి.

విశ్వక్‌సేన్‌ కల్ట్‌ సినిమా రివ్యూ…బర్త్‌ డే పార్టీలో రక్తసిక్తం!

ఎన్టీఆర్,రామ్‌చరణ్‌లు కలిసి నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా కోసం నవీన్‌ చంద్ర చాలా రోజులు షూట్‌ పాల్గొన్నారు. కానీ స్క్రీన్‌పై పెద్దగా కనిపిం చలేదు. రాజమౌళి (Director Rajamouli) దర్శకత్వం వహించిన సినిమా ఇది. అలానే ప్రియదర్శి కూడా. శంకర్‌ డైరెక్ట్‌ (Director sankar)# చేసిన ‘గేమ్‌ చేంజర్‌’ మూవీలో ప్రియదర్శి దాదాపు నెల రోజులు షూట్‌లో పాల్గొన్నారు. కట్‌ చేస్తే…స్క్రీన్‌పై ప్రియదర్శి ఎంతసేపు కనిపించారో సినిమా చూసిన అందరికీ తెలిసిందే.

రియాలిటీలోనే ఉన్నారా?

ఈ విషయంలో కుర్రదర్శకులు తక్కువేం కాదు. శ్రీకాంత్‌ ఓదెల నానితో ‘ది ప్యారడైజ్‌’ తీశారు. ఇందులో బాబుమోహన్‌ పాత్ర స్క్రీన్‌పై కనిపిం చలేదు. మరో యువ దర్శకుడు బుచ్చిబాబు సాన ‘పెద్ది’ సినిమాను దాదాపు నాలుగున్నర గంటలు తీశారని తెలిసింది. ఆనందదేవరకొండ, వైష్ణవీ చైతన్య, విరాజ్‌ అశ్విన్‌లు తీసిన ‘బేబీ’ సినిమా నిడివి దాదాపు ఆరుగంటల వరకు వచ్చిందని సాయిరాజేష్‌నే చెప్పారు. ఇలా షూట్‌ చేసిన సన్నివేశాలను తీసివేయడం, లేదా అనవసర ఫుటేజ్‌ను చిత్రీకరించడం అనేది నిర్మాతలకు పెద్ద తలనొప్పే. ఇండస్ట్రీ వచ్చిన కొత్త దర్శకులు ఇలా చేశారంటే అనుభవలేమీ అనుకోవచ్చు. కానీ అనుభజ్ఞులైన రాజమౌళి, త్రివిక్రమ్,శంకర్‌ వంటి ప్రముఖ దర్శకులు కూడ ఈ వేస్టేజ్‌ని కంట్రోల్‌ చేయడంలో ఫ్లాప్‌ కావడం బాధాకరం.

Please Share
Share This Article
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu