Sreeleela Movies: టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్నారు శ్రీలీల. టాప్ హీరోలతో సినిమాలు చేశారు. కానీ ఈ హీరోయిన్ నటిం చిన టాలీవుడ్ సినిమాలు ఇటీవలి కాలంలో వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో శ్రీలీలకు టాలీవుడ్లో అవకావాలు తగ్గాయి. దీంతో ఈ అమ్మడు ఇప్పుడు కోలీ వుడ్‌పై ఫోకస్ పెట్టారు. కోలీవుడ్‌లో వరుస అవకాశాలను చేజిక్కించుకుంటున్నారు. కోలీవుడ్‌లో మూడు..బాలీవుడ్లో రెండు
తమిళంలో మూడు సినిమాలు
ధనుష్ హీరోగా నటిస్తున్న తమిళ సినిమా ‘ఓం’లో ఓ హీరోయిన్గా నటిస్తున్నారు శ్రీలీల. ఇందులో సాయిపల్లవి మరో హీరోయిన్. ‘అమరన్’ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది. ఇక ఇప్పటికే రజనీకాంత్ ‘ధర్మన్’ సినిమా చిత్రీకరణలో పాల్గొ న్నారు శ్రీలీల. నయనతార, సిమ్రాన్, రాశీఖన్నా..లతో పాటుగా శ్రీలీల ఈ సినిమాలో నటిస్తున్నారు. రీసెం ట్‌గా అజిత్ ‘డేర్డేవిల్’ సినిమాలోనూ చాన్స్ దక్కించుకున్నారు శ్రీలీల. అయితే మెయిన్ హీరోయిన్ రోల్ కాదనే ప్రచారం జరుగుతోంది. ‘ఓం’ సినిమా నవంబరు 20న విడుదల కానుంది. ‘ధర్మన్’ సినిమా సంక్రాం తి రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ‘డేర్ డేవిల్’ చిత్రం వేసవిలో రిలీజ్ కానుంది.
రామాయణం రిలీజ్…కాజల్ మౌనం వెనుక కారణం ఏంటి?
టాలీవుడ్లో నో చాన్స్
ఏదీ ఏమైనా కోలీవుడ్‌లో ముగ్గురు స్టార్ హీరోల సినిమాల్లో చాన్స్‌లను దక్కించుకుని శ్రీలీల అక్కడ ఫుల్ ఫామ్‌లోకి వచ్చారు. ఈ బ్యూటీ హిందీలోనూ రెండు సినిమాలు చేస్తున్నారు. కానీ టాలీవుడ్లో మాత్రం ఒక్కంటే ఒక్క సినిమా కూడా శ్రీలీల ప్రజెంట్ లైనస్లో లేవు. కోలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో శ్రీలీల చేస్తున్న ప్రజెంట్ సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిస్తే, అప్పుడు మళ్లీ టాలీవుడ్లో శ్రీలీలకు చాన్స్ దొరికే అవకాశం ఉంటుంది. మరి..ఆమె ఎలాంటి స్క్రిప్ట్‌లను ఎంచుకున్నారు అనేది మరికొన్ని నెలల్లో తెలిసిపోయింది. అన్నట్లు..ప్రజెంట్ శ్రీలీల చేస్తున్న ఏ సినిమాలోనూ ఆమె సోలో హీరోయిన్ కాకపోవడం, ఈ యంగ్ హీరో యిన్‌కు ఉన్న మరో మేజర్ ప్లాబ్లమ్.