please subscribe to Tollywoodhub YouTube channel

Sankrati2025 winner: హిస్టరీ రిపీట్‌…వెంకటేష్‌ డబుల్‌ విక్టరీ!

Sankrati2025 winner: 2025 సంక్రాంతి బాక్సాఫీస్‌ బరిలో వెంకటేష్‌ 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ మంచి లీడ్‌ తీసుకుంది. బాక్సాఫీస్‌ లెక్కల ప్రకారం 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ 2025 సంక్రాంతి విన్నర్‌గా తెలుస్తోంది.

Viswa
2 Min Read

Web Stories

Sankrati2025 winner: 2019 సంక్రాంతికి తెలుగులో రిలీజైన సినిమాలను ఓ సారి గుర్తు చేసుకుంటే….బాలకృష్ణ ‘ఎన్టీఆర్‌: కథానాయకుడు’, రామ్‌చరణ్‌ ‘వినయ విధేయ రామ’, వెంకటేష్‌ ‘ఎఫ్‌ 2’ సినిమాలు రిలీజైయ్యాయి. ‘ఎన్టీఆర్‌: కథానాయకుడు, వినయ విధేయ రామ’ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్స్‌గా నిలవగా, వెంకటేష్‌ ‘ఎఫ్‌ 2’ చిత్రం బాక్సాఫీస్‌ దుమ్మురేగ్గెట్టేసింది. హీరో వెంకటేష్‌– దర్శకుడు అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లోని ఈ తొలి 2019 సంక్రాంతి బాక్సాఫీస్‌ విన్నర్‌గా నిలిచింది.

Ramcharan GameChanger Movie Review: రామ్‌చరణ్‌ గేమ్‌ఛేంజర్‌ మూవీ రివ్యూ

ఇప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత రామ్‌చరణ్, బాలకృష్ణ, వెంకటేష్‌ కాంబినేషన్‌లోని సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్‌ వద్దకు వచ్చాయి. 2025 సంక్రాంతికి…రామ్‌చరణ్‌ ‘గేమ్‌ఛేంజర్‌ (GameChanger)’, బాలకృష్ణ ‘డాకు మహారాజ్‌ (Daakumaharaj)’ వెంకటేష్‌ ‘సంక్రాంతికి వస్తున్నాం’  (SankratikiVasthunnam) చిత్రాలు విడుదలైయ్యాయి.

Balakrishna Daakumaharaj Review

కాకపోతే ఈ సంక్రాంతికి రామ్‌చరణ్‌ ‘గేమ్‌చేంజర్‌’ మూవీ మాత్రమే ఫ్లాప్‌ కాగా, బాలకృష్ణ ‘డాకు మహారాజ్‌’ ఫర్వాలేదనిపించింది. కానీ 2025 సంక్రాంతి విన్నర్‌గా మాత్రం వెంకటేష్‌ నిలిచారు. వెంకటేష్‌–అనిల్‌రావిపూడి కాంబినేషన్‌లోని ‘సంక్రాంతి వస్తున్నాం’ మూవీ బ్లాక్‌బస్టర్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సినిమా ఆల్రెడీ బ్లాక్‌బస్టర్‌ అని, ఇప్పటికే సేల్‌ అయిన టికెట్స్‌ చెబుతున్నాయి.

DaakuMaharaaj Review: డాకుమహారాజ్‌ రివ్యూ

Sankrathiki Vasthunnam
Sankrathiki Vasthunnam

సంక్రాంతికి రామ్‌చరణ్, బాలకృష్ణ, వెంకటేష్‌ సినిమాలు ఒకేసారి స్క్రీన్‌పైకి రావడం, రెండు సార్లు వెంకటేష్‌నే విక్టరీ కొట్టడం విశేషం. మరో ఆశ్చర్యకరమైన విశేషం ఏంటంటే…వెంకటేష్‌ చేసిన ‘ఫ్యామిలీ డ్రామా ‘కలిసుందాం..రా’ సినిమా పాతిక సంవత్సరాల క్రితం జనవరి 14నే విడుదలై, బ్లాక్‌ కొట్టింది. ఇప్పుడు ఈ సంక్రాంతికి వెంకటేష్‌ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో బ్లాక్‌బస్టర్‌ సాధించారు. ఈ సినిమా కలెక్షన్స్‌ వెంకటేష్‌ కెరీర్‌లో హాయ్యెస్ట్‌ మార్జిన్‌గా ఉండేటట్లు కనిపిన్నాయి.

Sankranthiki Vasthunam Review: సంక్రాంతికి వస్తున్నాం రివ్యూ

ఇక వెంకటేష్‌ నెక్ట్స్‌ మూవీ కోసం సురేష్‌ ప్రొడక్షన్స్, సితార ఎంటర్‌టైన్మెంట్స్, వైజయంతీమూవీస్‌ వంటి నాలుగు ప్రధాన నిర్మాణసంస్థల్లో కథలకు చర్చలు జరుగుతున్నాయి. మరి… వెంకటేష్‌ ఏ బ్యానర్‌లో మూవీ చేస్తారో చూడాలి.

Sookshmadarshini ott: మలయాళ బ్లాక్‌బస్టర్‌ సూక్ష్మదర్శని రివ్యూ

Please Share
3 Comments
ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi