VijayDevarakonda Next film: లైగర్‌ నిర్మాతతో విజయ్‌ మళ్లీ మూవీ?

VijayDevarakonda Next film: బాలీవుడ్‌లో 'కిల్‌' మూవీ తీసిన నిఖిల్‌ నగేష్‌భట్‌తో విజయ్‌దేవరకొండ ఓ మూవీ చేయాలనుకుంటున్నారట.

Viswa
1 Min Read
Hero VijayDevarakonda film with Kill Director nagesg bhat

బాలీవుడ్‌ ‘కిల్‌’ మూవీ యాక్షన్‌ లవర్స్‌ను ఇంప్రెస్‌ చేసింది. బాలీవుడ్‌ హీరో లక్ష్య ఈ మూవీలో హీరో. నిఖిల్‌ నగేష్‌ భట్‌ ఈ మూవీని డైరెక్ట్‌ చేశాడు. అయితే నిఖిల్‌ కొన్నిరోజులుగా టాలీవుడ్‌ హీరోతో మూవీ చేయాలని ప్రయత్నాలు స్టార్ట్‌ చేశాడు. ఇటీవల రామ్‌చరణ్‌తో నిఖిల్‌ నగేష్‌ మూవీ ఉంటుందనే ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు విజయ్‌ దేవరకొండ పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల హైదరాబాద్‌లో విజయ్‌ దేవరకొండను కలిశారు నిఖిల్‌. వీరిమధ్య ఈ సినిమాను గురించిన ప్రతిపాదన వచ్చిందట. ఈ మూవీని బాలీవుడ్‌ బడా దర్శక–నిర్మాత కరణ్‌జోహార్‌ నిర్మించనున్నారని బాలీవుడ్‌ సమాచారం.

విజయ్‌దేవరకొండ ‘డియర్‌కామ్రేడ్‌’ మూవీ అప్పట్నుంచే విజయ్‌దేవరకొండ (VijayDevarakonda Next film)తో టచ్‌లో ఉన్నారు కరణ్‌ జోహర్‌. ఈ సినిమా హిందీ రైట్స్‌ ఇంకా కరణ్‌జోహార్‌ చేతిలోనే ఉన్నాయి. ఆ తర్వాత ఎలాగో అలా.. పూరీ జగన్నాథ్‌ డైరెక్ట్‌ చేసిన ‘లైగర్‌’ సినిమాకు ఓ నిర్మాతగా ఉన్నారు కరణ్‌జోహర్‌. కానీ విజయ్‌దేవరకొండ కెరీర్‌లోనే ‘లైగర్‌’ మూవీ ఓ డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ఈ సారి మాత్రం విజయ్‌దేవరకొండతో సోలో నిర్మాతగా కరణ్‌జోహర్‌ ఓ సినిమాను తీయాలని నిర్ణయించు కున్నారట. ఆ దశగా ఏర్పాట్లు జరుగు తున్నాయని బాలీవుడ్‌ సమాచారం.

కానీ ప్రస్తుతం గౌతమ్‌తిన్ననూరితో ‘కింగ్‌డమ్‌’ మూవీ చేస్తున్నారు విజయ్‌దేవరకొండ. ఈ మూవీ మే 30న రిలీజ్‌ కానుంది. ఒకవేళ ఈ సినిమా హిటై్టతే, ఈ సినిమా రెండోపార్టు కూడా ఉంది. అలాగే తనతో టాక్సీవాలా తీసిన రాహుల్‌సంకృత్యాన్‌తో ఓ మూవీ, ‘రాజావారురాణిగారు’ మూవీ తీసిన రవికిరణ్‌ కోలాతో మరో మూవీ విజయ్‌ కమిటైయ్యాడు. సుకుమార్‌తోనూ విజయ్‌కు ఓ కమిట్‌మెంట్‌ ఉంది. మరి… ఈ ప్రాజెక్ట్స్‌ అన్నీ ఓ కొలిక్కి వచ్చిన తర్వాత కానీ నిఖిల్‌తో విజయ్‌ చేయబోయే మూవీపై ఓ క్లారిటీ వచ్చే చాన్సెస్‌ ఉన్నాయని ఊహింవచ్చు.

 

 

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *