విక్రమ్‌ వీర ధీర శూర టీజర్‌ విడుదల

vikram Veera Dheera Sooran part 2 Teaser: విక్రమ్‌ హీరో లేటెస్ట్‌ మూవీ వీర ధీర శూర టీజర్‌ విడుదలైంది. ఈ మూవీ మార్చి 27న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది.

Viswa
1 Min Read
vikram Veera Dheera Sooran part 2

విక్రమ్‌ హీరోగా యాక్ట్‌ చేసిన తాజా తమిళ చిత్రం ‘వీర ధీరశూరన్‌’ (vikram Veera Dheera Sooran part 2 Teaser). దుషారా విజయ్‌ ఈ మూవీలో హీరోయిన్‌గా యాక్ట్‌ చేశారు. యస్‌యు అరుణ్‌ కుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, హెచ్‌ఆర్‌ పిక్చర్స్‌తో కలిసి, రియా ప్రభు ఈ మూవీని నిర్మించారు. రెండు పార్టులగా ఈ మూవీ రిలీజ్‌ కాబోతుంది. కాకపోతే ముందుగా రెండో పార్టును…అంటే..‘వీర ధీర శూరన్‌: పార్టు 2’ను రిలీజ్‌ చేస్తున్నారు. మార్చి 27 ఈ మూవీ రిలీజ్‌ కానుంది.

టీజర్‌ విడుదల

ఈ ఇంటెన్స్‌ యాక్షన్‌ డ్రామా టీజర్‌ను శనివారం విడుదల చేశారు మేకర్స్‌. టీజర్‌ యాక్షన్‌ ప్యాక్డ్‌గా ఉంది. ఈ రూరల్‌ డ్రామాలో ఎస్‌జే సూర్య పోలీసాఫీసర్‌గా యాక్ట్‌ చేస్తున్నాడు. ఈ మూవీలో విక్రమ్,దుషార భార్య భర్తలుగా కనిపిస్తారు. ఓ లోకల్‌ క్రైమ్‌ వల్ల వీరి జీవితాలు ఎలా ప్రభావితం అయ్యాయి? అనేది సినిమాలో చూడాలి.

తెలుగులో వీర ధీర శూర

ఈ సినిమాను తెలుగులో ‘వీర ధీర శూర’ పేరుతో రిలీజ్‌ చేస్తున్నారు. తెలుగు ఎన్వీఆర్‌ సంస్థ దక్కించు కుంది. కానీ నైజాంలో మాత్రం మైత్రీ డిస్ట్రిబ్యూషన్‌ వారు రిలీజ్‌ చేస్తున్నారు.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *