వరుణ్‌తేజ్ (Varuntej) లేటెస్ట్ మూవీ ప్రారంభోవత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఇండో–కొరియన్ హారర్ కామెడీ సినిమా (VD15)కు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్‌తేజ్ కెరీర్‌లోని ఈ 15వ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. వరుణ్‌తేజ్ పాల్గొనగా, కీలక సన్నివేశాలను చిత్రీక రిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ మూవీలో రితికా నాయక్ హీరోయిన్‌గా యాక్ట్ చేస్తున్నట్లుగా తెలిసింది.
రాయలసీమ నేపథ్యంతో…!
ఈ హారర్ కామెడీ మూవీ రాయలసీమ నేపథ్యంతో సాగుతుంది. ఓ కొరియన్ దెయ్యంతో హీరో చేసే కామెడీ, ఓ కాన్‌ప్లిక్ట్ నేపథ్యంతో ఈ మూవీ కథనం ఉంటుంది. హీరో చిత్తూరు యాసలో మాట్లాడతారు. మోడ్రన్ భూతవైద్యుడి తరహాలో హీరో క్యారెక్టరైజేషన్ ఉండబోతుందని తెలిసింది. ఈ చిత్రానికి కొరియన్ కనకరాజు అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నారు. ఈ మూవీలో వరుణ్‌తేజ్–కమేడియన్ సత్యల మధ్య వచ్చే కామెడీ సీన్స్ హైలైట్‌గా ఉండబోతున్నాయని తెలిసింది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్‌ను త్వరతగతిన పూర్తి చేసి, ఈ ఏడాదే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది చిత్రంయూనిట్ ప్రస్తుత ప్లాన్‌గా తెలుస్తోంది. ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు. వరుణ్‌తేజ్ కెరీర్‌లోని లవబుల్ హిట్ ఫిల్మ్ ‘తొలిప్రేమ’ తర్వాత…వరుణ్‌తేజ్ సినిమాకు మళ్లీ తమన్ సంగీతం అందిస్తున్నది ఈ మూవీకే కావడం విశేషం.