ప్రియదర్శి ‘సారంగపాణి జాతకం’ మూవీ రివ్యూ

Sarangapani jathakam movie review: ప్రియదర్శి హీరోగా, వెన్నెల కిశోర్‌, వైవా హర్ష లీడ్‌ రోల్స్‌లో నటించిన 'సారంగపాణి జాతకం' మూవీ రివ్యూ

Viswa
4 Min Read
Priyadarshi Pulikonda Sarangapani jathakam movie review in telugu

Web Stories

సినిమా: సారంగపాణి జాతకం (Sarangapani jathakam movie review)
ప్రధాన తారాగణం: ప్రియదర్శి పులికొండ, రూప కొడువాయూర్, వైవా హర్హ, వెన్నెల కిశోర్, అవసరాల శ్రీనివాస్, ప్రదీప్‌ రుద్ర, తనికెళ్ల భరణి, వీకే నరేశ్, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్‌
దర్శకత్వం: ఇంద్రగంటి మోహనకృష్ణ
నిర్మాణం: శివలెంక కృష్ణప్రసాద్‌
ఎడిటర్‌: మార్తాండ్‌ కె వెంకేటష్‌
సంగీతం: వివేక్‌ సాగర్‌
కెమెరా: పీజీ విందా
విడుదల తేదీ: 25 ఏప్రిల్‌ 2025
నిడివి: 2 గంటల 20 నిమిషాలు
రేటింగ్‌: 2.5/5.0

కథ

జాతకలే జీవితం అనుకునే వ్యక్తి సారంగపాణి (ప్రియదర్శి). తన కంపెనీ లో రెండేళ్లు గా బెస్ట్ సేల్స్ మాన్. అదే కంపెనీ లో మైథిలి (రూప) ప్రతి విషయం లోనూ ప్రాక్టికల్ అండ్ లాజిక్స్ చూస్తుంది. సారంగపాణికి మైథిలి లవ్ ప్రపోజ్ చేస్తుంది. పెళ్లి చేసుకోవాలనుకుంటారు. నెల రోజుల్లో పెళ్లి. ఓ రోజు పబ్ లో జిగేశ్వరానంద (అవసరాల శ్రీనివాస్) ని కలుస్తాడు సారంగపాణి. అయితే..సారంగపాణి జాతకం లో ఓ మర్డర్ చేసే ఛాన్స్ ఉందని జిగేశ్వరానంద చెబుతాడు. దింతో…జాతకాల పిచ్చి ఉన్న సారంగపాణి తన పెళ్లిని వాయిదా వేసుకుంటాడు. తన జాతకం లో ఎలాగూ ఓ మర్డర్ అని ఉంది కాబట్టి.. పెళ్లి కి ముందే ఓ మర్డర్ చేస్తే ప్రాబ్లెమ్ సాల్వ్ అవుతుందని అనుకుంటాడు సారంగపాణి. తన ఫ్రెండ్ చందు (వెన్నెల కిశోర్) తో  కలిసి ఓ మర్డర్ ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? అసలు.. అహోబిలా రావు (తనికెళ్ళ భరణి) కి సారంగపాణి కి ఉన్న కనెక్షన్ ఏమిటి? సారంగపాణి ప్లాన్ లో రాకీ (వైవా హర్ష) ఎలా భాగం అయ్యాడు అన్నదే స్టోరీ.

విశ్లేషణ

జాతకాల పై నమ్మకం ఉండచ్చేమో కానీ, ఆ నమ్మకం పిచ్చి కాకూడదని చెప్పే సినిమానే సారంగపాణి జాతకం సినిమా. అతిగా జాతకాలను నమ్మిన వ్యక్తి జీవితం, అతని చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాలు ఏమి అవుతాయి అన్నదే సినిమా. కాకపోతే చిన్న క్రైమ్‌ ఎలిమెంట్‌ జోడించారు.

ఫస్ట్ హాఫ్ లో వచ్చే డైనింగ్ సీన్, వెన్నెల కిశోర్ – ప్రియదర్శిల మధ్య వచ్చే కామెడీ సీన్స్,  విలేజ్ బ్యాక్ డ్రాప్ సీన్స్ కడుపుబ్బ నవ్విస్తాయి. ఓ బర్త్డే పార్టీ సీన్ తో ఫస్ట్ హాఫ్ క్లోజ్ అవుతుంది. ఓ రిపీట్ సీన్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఫస్ట్ హాఫ్ సరదాగా సాగితే.. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ మోషనల్ టర్న్ తీసుకుని వైజాగ్ వెళ్తుంది. సినిమా లోని అన్ని మేజర్ క్యారెక్టర్స్ అన్ని అహోటల్ అనే హోటల్ లో కలవడం, ఓ క్రైమ్ ఎలిమెంట్తో, ఓ చిన్న పాటి యాక్షన్ సీన్,  ఊహత్మక క్లైమాక్స్ తో స్టోరీ ముగుస్తుంది.

జాతకాలను హీరో ఎందుకు నమ్ముతాడనే బలమైన పాయింట్‌ కథలో ఉండదు. హాత్యా ప్రయత్నాలు సన్నివేశాలు రిపీట్‌ అయినట్లుగా ఉంటుంది. సైమన్‌ పాత్రను సడన్‌గా కట్‌ చేశారు. నరేటివ్‌ స్టైల్‌ ఓల్డ్‌ టెంప్లెట్‌లా ఉంది. కొందరు హీరోలు, సినిమాలపై సెటైర్స్‌ డైరెక్టర్‌కు రైటింగ్‌ను శాటిస్‌ఫై చేసి ఉండొచ్చు. కానీ కథాబలం లేకపోతే ఆడియన్స్‌ శాటిస్‌ఫై అవ్వడం కష్టం. అల్ఫా ఫిమేల్‌ క్యారెక్టర్‌, రాజా క్యారెక్టర్స్‌ సినిమాలకు ఎక్స్‌ట్రా బ్యాగేజ్‌. ఇటు క్రైమ్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో స్టోరీ లేదు. అటు..జాతకాలను సిరీయస్‌గా చూపించలేదు. ఇలాంటి కథనం లో ఆడియన్స్‌ కనెక్ట్‌ కావడం అనేది చాలా కష్టం.

ఎవరు ఎలా చేశారు?

సారంగపాణి గా ప్రియదర్శి నటన బాగుంది. విలేజ్ సీన్స్, ఇంటర్వెల్ సీన్ లో ప్రియదర్శి యాక్టింగ్ బాగుంటుంది. మంచి కామెడీ టైమింగ్ చూపించాడు. మైథిలి గా రూప కు రొటీన్ హీరోయిన్ రోల్ చేసింది. హీరో ఫ్రెండ్ చందు గా వెన్నెల కిశోర్ రోల్ సినిమా త్రూ అవుట్ ఉంటుంది. తన మార్క్ స్టైల్ కామెడీ సీన్స్  చేశాడు. సారంగపాణి కి మరో ఫ్రెండ్, హోటల్ వెయిటర్గా వైవా హర్ష మెప్పించాడు.

జిగేశ్వరానంద గా అవసరాల శ్రీనివాస్ చిన్న నెగటివ్ షెడ్స్ ఉన్న రోల్ చేసాడు. ఆటో మొబైల్ కంపెనీ  ఏండీ సైమన్ గా రుద్ర, సారంగపాణి తండ్రి పినాకా గా వడ్లమాని శ్రీనివాస్, హీరోయిన్ ఫాదర్ నరేన్ గావీకే నరేష్ గా యాక్ట్ చేశారు. శివన్నారాయణ, , రాజా చేబ్రోలు వారి పాత్ర ల పరిధి మేరకు యాక్ట్ చేశారు.

కామెడీ సినిమా ల్లో ఇంద్రగంటి స్టయిల్ అఫ్ నరేషన్ ఈ సినిమా లోనూ ఉంటుంది. అయన కామెడీ పంచ్ లు, వ్యంగపు పంచ్ లు నవ్విస్తాయి. కొంత సిట్యుయేషన్ కామెడీ ప్లస్ పాయింట్. కానీ…సెకండ్ హాఫ్ ప్రిడిక్ట్ బుల్ గా ఉంటుంది. కాస్త రొటీన్ స్క్రీన్ ప్లే  ఆడియన్స్ సహనాన్ని టెస్ట్ చేస్తుంది.  ముఖ్యంగా సెకండ్ హాఫ్. ట్విస్ట్ కూడా కొత్త దేమి కాదు. నిర్మాణం విలువలు ఒకే.  ఎడిటింగ్ ఇంకాస్త చేయవచ్చు. మ్యూజిక్, విజువల్స్ ఓకే.

బాటమ్‌లైన్‌: జాతకంలో హిట్‌ రేఖ చిన్నదిగా ఉంది.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi