VrushaKarma: నిధివేటలో వృషకర్మ

Viswa
1 Min Read
Nagachaitanya Vrushakarma movie

‘తండేల్‌’ సినిమా సక్సెస్‌ తర్వాత నాగచైతన్య (nagachaitanya) మరో కొత్త సినిమాకు శ్రీకారం చూట్టారు. విరూపాక్ష సిని మాతో సాయిధరమ్‌తేజ్‌కి సాలిడ్‌ హిట్‌ ఇచ్చిన, కార్తీక్‌ దండు దర్శకత్వంలో ఓ మైథికల్‌ థ్రిల్లర్‌ చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. కొన్ని నెలలుగా ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. లేటెస్ట్‌గా ఈ మూవీ నుంచి వచ్చిన ప్రిపరేషన్‌ వీడియో ఆకట్టుకునేలా ఉంది. లొకేషన్స్, విజువల్స్, ప్రోస్థేటిక్‌ మేకప్, ప్రీ కాన్సెప్ట్‌ పోస్టర్‌..అన్నీ నాగచైతన్య చేస్తున్న ఈ సినిమాపై అంచనాలను పెంచేలా ఉన్నాయి.

మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే…ఈ సినిమాకు వృషకర్మ (VrushaKarma) అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట మేకర్స్‌.అలాగే ఈ మూవీ ప్రధానంగా ఓ నిధివేట నేపథ్యంతో ఉంటుందని, ఇందుకోసం నాగచైతన్య పెద్ద పెద్ద పర్వతాలు ఎక్కాల్సి ఉంటుందట. ఇలా సినిమా అంతా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నాగచైతన్య కెరీర్‌లో ఇప్పటి వరకు చేయని ఈ వినూత్నమైన సినిమా అతని కెరీర్‌లో ఓ మైలురాయిలా నిలిచే అవకాశాలు కనిపి స్తున్నాయి. ఈ సినిమాలో మీనాక్షీ చౌదరిని హీరోయిన్‌గా అనుకుంటున్నారు. ఆల్మోస్ట్‌ కన్ఫార్మ్‌. భారీ స్థాయి ఫిల్మ్‌ కాబట్టి, వీఎఫ్‌ఎక్స్‌ వర్క్స్‌ కూడా బాగానే చేయాల్సి ఉంటుంది. వందకోట్ల రూపాయాలకుపైనే ఈ సినిమా బడ్జెట్‌ ఉంటుందని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ఈ మూవీ ఈ ఏడాది అయితే రిలీజ్‌ కాకపోవచ్చని తెలు స్తోంది. బాసినీడు సమర్పణలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌, సుకుమార్‌ ఈ సినిమాను తీస్తున్నారు.

మోహన్‌లాల్‌ తుడరుమ్ సినిమా తెలుగు రివ్యూ

Please Share
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *