please subscribe to Tollywoodhub YouTube channel

రాజమౌళికి పోటీగా ఆమిర్‌కాన్‌ …మధ్యలో ఎన్టీఆర్‌

Viswa
2 Min Read
Aamir khan in DadasahebPhalke Biopic directed by Rajkumarhirani

Web Stories

ఫాదర్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమాగా చెప్పుకునే దాదా సాహేబ్‌ ఫాల్కే (Aamir khan in DadasahebPhalke Biopic) జీవితం ఆధారంగా హీరో ఆమిర్‌ఖాన్‌ (Aamirkhan) ఓ సినిమా చేయనున్నారు. ఆమిర్‌ఖాన్‌తో ‘పీకే, త్రీ ఇడియట్స్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీస్‌ తీసిన రాజ్‌కుమార్‌ హిరాణి (Director Rajkumar Hirani) ఈ సినిమాకు దర్శకుడు. ఈ బయోపిక్‌పై ఆల్రెడీ అధికారిక అనౌన్స్‌మెంట్‌ వచ్చింది.

మరోవైపు రాజమౌళి (Rajamouli)తనయుడు ఎస్‌ఎస్‌ కార్తీకేయ, వరుణ్‌గుప్తాలు నిర్మాతలుగా ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ అనే సినిమాను చేయనున్నారు. ఈ సినిమాకు రాజమౌళి సమర్పకుడు. దాదా సాహేబ్‌ ఫాల్కే జీవితం ఆధారంగా ఈ సినిమా రానుందని మేకర్స్‌ చెప్పుకుంటున్నారు. కొడుకు కార్తీకేయ ఈ సినిమాకు నిర్మాతగా కాబట్టి, స్క్రిప్ట్‌ విషయంలోనూ రాజమౌళి కేర్‌ తీసుకుంటారని ఊహింవచ్చు. నితిన్‌ కట్టర్‌ ఈ సినిమాకు దర్శకుడు.

అయితే దాదా సాహేబ్‌ ఫాల్కే జీవితం ఆధారంగా (DadasahebPhalke Biopic) ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ సినిమా రాబో తుందని, ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తారనే వార్త తెరపైకి రాగానే, ఆమిర్‌ఖాన్‌ – రాజ్‌కుమార్‌ హిరాణిల ప్రాజెక్ట్‌ కూడా తెరపైకి రావడం విశేషం. ఇలా రాజమౌళితో ఆమిర్‌ఖాన్‌ పోటీ పడుతున్నాడు.

ఇంకా మహాభారతం (Mahabharatham)  ఆధారంగా ఓ ట్రయాలజీ (మూడుభాగాలుగా) తీయాలన్నది తన డ్రామ్‌ ప్రాజెక్ట్‌ అని రాజమౌళి, పలుసందర్భాల్లో చెప్పారు. కానీ…మహాభారతం స్క్రిప్ట్‌పై ఆల్రెడీ ఆమీర్‌ఖాన్‌ ఓ సినిమా చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టాడు. తాను మహాభారతం ఆధారంగా తీయబోయే సినిమాలోని అర్జునుడి పాత్రకు అల్లు అర్జున్‌ను ఆమిర్‌ఖాన్‌ కలిశారనే టాక్‌ వినిపిస్తోంది ఇండస్ట్రీలో. ఇటు దాదా సాహేబ్‌ ఫాల్కే బయోపిక్‌…ఇటు మహాభారతం సినిమా …ఇలా రెండు విధాలుగా రాజమౌళితో ఆమిర్‌ఖాన్‌ పోటీ పడుతున్నారు. రాజమౌళి మహాభారతం ఆధారంగా సినిమా తీస్తే..అందులో ఎన్టీఆర్‌ పాత్ర కచ్చితంగా ఉంటుంది. సో…ఇటు దాదా సాహేబ్‌ ఫాల్కే బయోపిక్‌ కావొచ్చు…అటు మహాభారతం సినిమా కావొచ్చు..ఆమిర్‌ఖాన్‌–రాజమౌళిల పోటీలో…మధ్యలో ఉన్నది మాత్రం ఎన్టీఆర్‌యే అని చెప్పుకోవాలి.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi