Nayanthara in Mega 157: సంక్రాతికి.. రఫ్ఫాడిద్దాం

Viswa
2 Min Read
Nayanathara in ChiruAnil Movie

Web Stories

‘సైరా:నరసింహారెడ్డి, గాడ్‌ఫాదర్‌’ సినిమాల తర్వాత హీరో చిరంజీవి, హీరోయిన్‌ నయనతార (Nayanthara in Chiranjeevi movie) స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్నారు. చిరంజీవి హీరోగా అనిల్‌ రావిపూడితో ఓ సినిమా రానుంది. ఈ మూవీలోనే నయనతార హీరోయిన్‌గా చేస్తున్నారు. ఈ విషయాన్ని మేకర్స్‌ శనివారం అధికారికంగా ప్రకటించారు (Nayanthara in Mega 157). ఓ స్పెషల్ వీడియో తో ఈ అనౌన్మెంట్ వచ్చింది. ఇటీవల అనిల్ రావిపూడి చెన్నై వెళ్లి, ఈ స్పెషల్ వీడియో ను షూట్ చేశారు.

 

ఇంకా ఈ మూవీ (ChiruAnil)లోని మరో హీరోయిన్‌ పాత్రలో క్యాథరీన్, ఇతర సపోర్టింగ్‌ క్యారెక్టర్స్‌లో అభినవ్‌ గోమఠం, హర్షవర్థన్, సచిన్‌ ఖేడ్కర్‌లు యాక్ట్‌ చేయనున్నట్లుగా తెలుస్తోంది. చిరంజీవి కెరీర్‌లోని ఈ 157వ సినిమాను సుష్మితా కొణిదెల (చిరంజీవి పెద్ద కుమార్తె), సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈ నెల 23 నుంచి ఈ మెగా 157 సినిమా చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లుగా తెలిసింది. ఈ సినిమాను ఆల్రెడీ 2026 సంక్రాంతి సందర్భంగా రిలీజ్‌ చేస్తామని మేకర్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

చిరంజీవి-నయనతారలు స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న విధానం కొత్తగా ఉంటుంది. చారిత్రాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో చిరంజీవి- నయనతారలు భార్య భర్తలుగా యాక్ట్‌ చేశారు. మలయాళ హిట్‌ ఫిల్మ్‌ లూసీఫర్‌ తెలుగు రీమేక్‌లో ‘గాడ్‌ఫాదర్‌’లో చిరంజీవి-నయనతారలు అన్నచెల్లెల్లుగా నటించారు. ఇప్పుడు మెగా157 సినిమాలో హీరో హీరోయిన్లుగా యాక్ట్‌ చేస్తుండటం విశేషం.

మరోవైపు ఈ సినిమా చేసేందుకు నయనతార భారీ పారితోషికం డిమాండ్‌ చేశారని, అయితే ఆ తర్వాత అనిల్‌రావిపూడి చెన్నై వెళ్లి నయనతారతో మాట్లాడి, ఓ డీసెంట్‌ రెమ్యూనరేషన్‌కు ఒకే ఒప్పుకునేలా చేశారనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మరోవైపు ‘ముక్కుత్తి అమ్మన్‌ 2, రాక్షసి (తమిళంలో రక్కయీ)’ వంటి లేడీ ఓరియంటెడ్‌ ఫిల్మ్స్‌తో ఎప్పట్లానే బిజీగా ఉన్నారు.

 

Please Share
Share This Article
123 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu