టైటిల్: షష్టిపూర్తి (Shashtipoorthi Review)
ప్రధాన తారాగణం: రాజేంద్రప్రసాద్, అర్చన, రూపేష్, ఆకాంక్షా సింగ్
నిర్మాత: రూపేష్‌కుమార్
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్
కథ, దర్శకత్వం: పవన్ ప్రభ
సినిమాటోగ్రఫీ: రామ్
సంగీతం: ఇళయారాజా
విడుదల తేదీ: 30 మే 2025
నిడివి: 2 గంటల 33 నిమిషాలు
ప్రధాన తారాగణం: రాజేంద్రప్రసాద్, అర్చన, రూపేష్, ఆకాంక్షా సింగ్
నిర్మాత: రూపేష్‌కుమార్
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్
కథ, దర్శకత్వం: పవన్ ప్రభ
సినిమాటోగ్రఫీ: రామ్
సంగీతం: ఇళయారాజా
విడుదల తేదీ: 30 మే 2025
నిడివి: 2 గంటల 33 నిమిషాలు
రేటింగ్ 2.5/5
Shashtipoorthi Story:కథ
దివాకర్ (రాజేంద్రప్రసాద్), భువన (అర్చన) ప్రేమించి, పెళ్లి చేసుకుంటారు. వీరి ఏకైక సంతానం శ్రీరామ్ (రూపేష్‌కుమార్) ప్రభుత్వన్యాయవాది. తల్లి మాట ప్రకారం శ్రీరామ్ నిజాయితీ గల లాయర్‌గా పని చేస్తుంటాడు. కానీ అతని నిజాయితీ వల్ల తన చుట్టూ ఎవరు ఉండరు. ఒంటరివాడు అయిపోతాడు. ఈ క్రమంలో శ్రీరామ్‌లైఫ్‌లోకి వస్తుంది జానకి (ఆకాంక్షసింగ్). జానకిని ఇష్టపడతాడు శ్రీరామ్. అయితే నిజాయితీగా ఉన్నవాడు ప్రస్తుత పరిస్థితుల్లో జీవితంలో నెగ్గుకురావడం కష్టమని, అలా నిజాయితీగా ఉండనంటే తనను పెళ్లిచేసుకుంటానని శ్రీరామ్‌కు కండీషన్ పెడుతుంది. జానకి చెప్పినట్లే శ్రీరామ్ మారిపోతాడు. కానీ ఓ కేసులో అన్యాయంవైపు నిలబడతాడు. దీంతో శ్రీరామ్ తల్లి భువనకు నచ్చదు. మరి.. అçప్పుడు ఏం జరిగింది. శ్రీరామ్ జీవితంలోకి జానకి ఏ ఉద్దేశంతో వచ్చింది? జానకి కుటుంబానికి జరిగిన అన్యాయానికి, దివాకర్‌కు ఉన్న సంబంధం ఏమిటి? షష్టిపూర్తి చేసుకోవాల్సిన వయసులో దివాకర్, భువన ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటారు. ఈ విడాకుల కేసును లాయర్‌గా శ్రీరామ్‌యే ఎందుకు వాదించాల్సి వస్తుంది? అన్నది ఈ సినిమా కథనం.
Shashtipoorthi Review: విశ్లేషణ
తల్లిదండ్రుల పెళ్లిని మళ్లీ వారి పిల్లలు చూడాలనుకుంటే చేసుకునే వేడుక షష్టిపూర్తి. ఈ అం శంపైనే సినిమాను టేకప్ చేశాడు దర్శకుడు పవన్ ప్రభ. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్ మూవీ ఇది. రాజేంద్రప్రసాద్– అర్చనల మధ్య వచ్చే సన్నివేశాలు బాగానే ఉంటాయి. కానీ వీరి మేజర్ సీన్స్ అన్నీ సెకండాఫ్‌లోనే ఉంటాయి. లవ్‌ట్రాక్ ఆడియన్స్ సహనాన్ని పరిక్షీస్తుంది. కానీ ఓ ట్విస్ట్ మాత్రం బాగుంటుంది. స్క్రీన్ ప్లే స్లోగా సాగుతుంది. ఆడియన్స్ బోర్ ఫీల్ అయ్యే రోటీన్ సన్నివేశాలు, సాగదీత సన్నివేశాలూ ఉన్నాయి. ప్రీ క్లైమాక్స్ బాగున్నంతగా క్లైమాక్స్ కూడా బాగుంటే బాగుండేది. కోర్టు డ్రామా ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది. అయితే కథలో కుటుంబ అనుబంధాలకు దర్శకుడు పవన్ ప్రభ పెద్ద పీట వేయడం బాగుంది. విడాకులు తీసుకోవాలనుకుంటున్న తల్లిదండ్రులను తిరిగి కలపాలని కొడుకు చేసే ప్రయత్నం బాగానే ఉంటుంది. ఇక్కడ ‘శతమానంభవతి’ సినిమా గుర్తుకురావొచ్చు. సినిమా టైటిల్ జస్టిఫికేషన్ కరెక్ట్‌గా ఉండదు.
Shashtipoorthi Review Cast and Crew: ఎవరు ఎలా చేశారు?
దివాకర్ పాత్రలో రాజేంద్రప్రసాద్ (Rajendraprasad), భువన పాత్రలో అర్చన (Archana) అద్భుతంగా నటించారు. 38 సంవత్సరాల క్రితం ‘లేడీస్ టైలర్’ సినిమాలో కలిసి నటించిన ఈ ఇద్దరూ మళ్లీ ఇప్పుడు ఈ షష్టిపూర్తి సినిమాలో మంచి నటనను కనబరచారు. ఎమోషనల్ సీన్స్‌లో నటులుగా తమ అనుభవం ఏంటో చూపించారు. అయితే దర్శకుడు పవన్‌ప్రభ వీరి నుంచి ఇంకాస్త అవుట్‌పుట్ రాబట్టాల్సింది. ఆర్బీ చౌదరి కజిన్ రూపేష్(Rupesh) విడుదలైన తొలి సినిమా ఇదే. మంచి నటన చూపించాడు. క్యారక్టరైజేషన్‌లో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. మంచి వాడిగా, చెడ్డవాడిగా, తల్లీదండ్రులను కలపాలనుకునే వ్యక్తిగా రూపేశ్ మంచి నటన చూపించాడు. మురళీధర్‌గౌడ్, అచ్చుత్‌కుమార్, చంటి, ఆనంద్‌చక్రపాణి, ప్రభాస్ శ్రీను వారి వారి పాత్రల మేరకు చేశారు. చిన్నపాటి నెగటివ్ షేడ్ ఉన్న జానకి పాత్రలో ఆకాంక్షాసింగ్ (AakankshaSingh) నటన బాగుంది. దర్శకుడు ప్రభ పర్వాలేదనిపించాడు. ఇక ఈ సినిమాకు ఇళయారాజా సంగీతం (Iilayaraja Music) అనుకున్నంత స్థాయిలో ఫ్లస్ కాలేదు. ఆర్‌ఆర్ ఒకే. హీరోగా ఫర్వాలేద నిపించిన రూపేశ్, నిర్మాతగానూ తొలి ప్రయత్నంలో అయితే సక్సెస్ అయ్యాడు. ఇంకాస్త ఎడి టింగ్ చేయవచ్చు. సినిమాటోగ్రఫీ ఒకే. తోటతరణి సెట్ వర్క్ బాగుంది.
తమిళ హిట్ గరుడన్ తెలుగు రీమేక్ భైరవం..తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా?
ఫైనల్‌గా ..స్లోగాసాగే షష్టిపూర్తి (ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా నచ్చవచ్చు)
References:
Online slots https://rafaelkmsk527317.blogsumer.com/40435519/casino-of-gold-dein-ultimativer-guide
References:
Ameristar casino council bluffs https://philosophywiki.space/wiki/HitnSpin_Bonus_ohne_Einzahlung_fr_50_Freispiele
References:
Las vegas strip casino list https://hard-rock-casino-ac-nj.online-spielhallen.de/
References:
Casino gta 5 https://jobaaty.com/employer/payid-casinos-australia-2026-instant-withdrawal-pokies