క్రిమినలే క్వీన్‌

Viswa
AanushkaShetty Ghaati Movie Release date is july 11

Web Stories

గత ఐదేళ్లలో అనుష్కాశెట్టి నుంచి రెండే రెండు చిత్రాలొచ్చాయి. ఒకటి ‘నిశ్శబ్దం’ (2020). మరొకటి ‘మిస్‌శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ (2023). వీటిలో మిస్‌శెట్టి..మిస్టర్‌ పొలిశెట్టి సినిమా ఫర్వాలేదనిపించింది. ఇప్పుడు అనుష్కాశెట్టి నుంచి రాబోతున్న మరో మూవీ ‘ఘాటి(Anushka shetty Ghaati Release)’. ఈ సినిమాకు జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్‌) డైరెక్టర్‌. యూవీ క్రియేషన్స్‌ సమర్పణలో రాజీవ్‌ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు ఈ సినిమాను నిర్మించారు. తమిళ నటుడు వెంకట్‌ ప్రభు ఈ ఘాటి సినిమాతోనే టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నాడు.

షూటి సినిమా కొత్త విడుదల తేదీ ఖరారైంది. ‘షూటి’  (Anushka shetty Ghaati Release) సినిమాను తొలుత ఏప్రిల్‌ 18న విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ ఏప్రిల్‌ 18న విడుదల కాలేదు. ఆ సమయంలో ఏప్రిల్‌ 17న తమ న్నా ‘ఓదెల 2’, 18న కల్యాణ్‌రామ్‌ ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ సినిమాలు విడుదల అయ్యా యి. అయితే తాజా ‘ఘాటి’ సినిమాను జూలై 11న విడుదల చేయనున్నట్లుగా మేకర్స్‌ అధికా రికంగా వెల్లడించారు.

షూటి సినిమా చిత్రీకరణ మేజర్‌గా ఆంధ్రా–ఓరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో షూటింగ్‌ జరుపుకుంది. వ్యాపారంలో అభివృద్ధి సాధించే క్రమంలో, ఆమె నమ్మిన వ్యక్తులే ఆమెకు నమ్మకద్రోహం చేస్తారు. దీంతో ఆమె క్రూరంగా మారిపోతుంది. ఒక్కొక్కరిని హతమారుస్తూ, తాను అనుకున్న వ్యాపార సామ్రాజ్యంలో రాణిగా ఎదుగుతుంది. అందుకే ‘ఘాటి’ సినిమా పోస్టర్‌పై..‘విక్టిమ్‌..క్రిమినల్‌..లెజెండ్‌’ అనే వర్డ్స్‌ కనిపిస్తుంటాయి. ‘అరుంథతి, భాగ మతి’వంటి ఫెరోషియస్‌ రోల్స్‌ తర్వాత అనుష్కాశెట్టి (Anushka shetty Ghaati )నుంచి ఈ సినిమా వస్తుంది. అలాగే 2010లో వచ్చిన ‘వేదం’ సినిమా కోసం అనుష్కాశెట్టి, క్రిష్‌ జాగర్లమూడి ఈ సినిమాకు పని చేశారు. మళ్లీ ఇప్పుడు ఘాటి మూవీ కోసం వర్క్‌ చేశారు.

 

Please Share
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi