please subscribe to Tollywoodhub YouTube channel

ఫేక్‌ యూట్యూబ్‌ వ్యూస్‌..ఫేక్‌ కలెక్షన్స్‌ నిర్మాతలకు హనికరం

Viswa
Producer and FDC Chairman DilRaju Comments on Fake ytube views and Fake Collections

Web Stories

ఏదైనా సినిమా ట్రైలర్‌ లేదా టీజర్‌ విడుదలైతే చాలు…ఇన్ని మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి…అన్ని మిలియన్ల వ్యూస్‌ వచ్చాయని, ఆ సినిమా యూనిట్‌ ఊదరగొడుతుంది. కానీ లక్షల్లో, కోట్లలో వ్యూస్‌ వచ్చిన ట్రైలర్‌ సినిమాలకు, ఆ రేంజ్‌లో కాదు కాదు..ఆ రేంజ్‌లో సగానికి సంగం కూడా ఆడియన్స్‌ థియేటర్స్‌ మెట్లు ఎక్కడం లేదు. ఈ విషయం లోనే ‘దిల్‌ ’రాజు కొన్ని కీలక నిర్ణ యా లు తీసుకున్నట్లుగా చెబుతున్నాడు. ఈ విషయంపైనే ‘తమ్ముడు’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ‘దిల్‌’ రాజు.

‘‘ఇకపై మా సినిమాల ట్రైలర్స్‌కు ఫేక్‌ యూట్యూబ్‌ వ్యూస్‌ కొనవద్దని మా సిబ్బందికి చెప్పాను. ఎందుకంటే…మొన్న ఆ మధ్య మా ఇంట్లో ఓ సినిమా ట్రైలర్‌ను చూసి, ఈ సినిమా ట్రైలర్‌కి ఇన్ని యూట్యూబ్‌ వ్యూస్‌ వచ్చాయా? అని ఆశ్చర్యపోయారు. నిజానికి చెప్పాలంటే..ఓ సినిమా ట్రైలర్‌ విడుదలైతే, ఆ సినిమా యూట్యూబ్‌ వ్యూస్‌ చూస్తే లక్షల్లో ఉంటున్నాయి. కానీ అదే సినిమా థియేటర్స్‌లోకి వస్తే, మార్నింగ్‌ షో కూడా ఫిల్‌ కావడం లేదు. అందుకే ఇకపై ఫేక్‌ యూ ట్యూబ్‌ వ్యూస్‌ (Fake Ytube Views) వద్దనుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు ప్రముఖ నిర్మాత ‘దిల్‌ ’ రాజు (Producer DilRaju) . నిజానికి ఇది మంచి పరిణామమే. ఎందుకంటే..నిజమైన వ్యూస్‌ ఉన్నప్పుడే ఓ సినిమా రేంజ్‌ ఏంటో ఆడియన్‌ని, నిర్మాతలకు, ఎగ్జిబిటర్స్‌కు, డిస్ట్రిబ్యూటర్స్‌కు ఓ అంచనా ఉంటుంది. సోషల్‌మీడియాలో కంపేరిజన్‌ వార్స్‌ అనవసరపు గోల ఉండదు. అయితే..మరి ఈ విధానాన్ని అందరు నిర్మాతలు ఫాలో అవుతారా?లేదా అనేది మాత్రం ప్రశ్నార్థకమే అని చెప్పాలి.

అలాగే ఫేక్‌ కలెక్షన్స్‌పై కూడా ‘దిల్‌’ రాజు (FDC Chairman DilRaju) కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. అమెరికాలో రెంట్రాక్‌ (Rentracksystem) సిస్టమ్‌ ఉంటుందని, దీని వల్ల ఫేక్‌ కలెక్షన్స్‌ (Fake coleections) కు ఆస్కారం ఉండదని, తద్వారా ఓ సినిమా అసలు సిసలైన వసూళ్లు బయటకు వస్తాయని కూడా ‘దిల్‌’ రాజు మాట్లాడారు. ఇది కూడా మంచి ప్లానే. ఓ సినిమా కరెక్ట్‌ కలెక్షన్స్‌ బయటకు వస్తే, ఆ సినిమా మార్కెట్‌ రేంజ్‌ ఏంటో తెలిసి పోతుంది. అప్పుడు హీరోలు వారి పారితోషికాలను తగ్గించుకునే చాన్స్‌ ఉంటుంది. ఇది నిర్మాతలకు కచ్చితంగా మంచి విషయమే. కాకపోతే కొందరు టాలీవుడ్‌ హీరోలకు మాత్రం ఇది చేదువార్తే అని చెప్పవచ్చు.

అయితే ఈ రెట్రాక్‌ సిస్టమ్‌ను తెలంగాణ మంత్రివర్గ సబ్‌కమిటీలో ప్రవేశపెడతానని, అది తొందర్లోనే ఈ విధానాన్ని తెలంగాణలో అమలు చేసే ప్రయత్నం చేస్తానని ‘దిల్‌’ రాజు అంటున్నారు. మరి..ఇది ఎంత వరకు సాధ్యమౌతుందో చూడాలి.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi