please subscribe to Tollywoodhub YouTube channel

మంచు విష్ణు కన్నప్ప..అంతా శివలీల

Viswa
Vishnu Manchu Kannappa trailer

Web Stories

విష్ణు మంచు (Manchu vishnu)  కలల ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప (Kannappa Movie)’. శివభక్తుడు కన్నప్ప జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తు న్నారు. హిందీలో మహాభారతం సీరియల్‌ తీసిన మఖేష్‌ కుమార్‌ సింగ్‌ ఈ సినిమాకు దర్శకుడు. ప్రీతి ముకుందన్‌ హీరోయిన్‌గా కనిపిస్తారు. ఇంకా ఈ సినిమాలో ప్రభాస్ (Prabhas in kannappa), అక్షయ్‌కుమార్, మోహన్‌లాల్, కాజల్‌ అగర్వాల్, మోహన్‌బాబు (mohanbabu Kannappa), ఆర్‌. శరత్‌కుమార్, బ్రహ్మాజీ, బ్రహ్మానందం, రఘుబాబు వంటి వారు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. మంచు విష్ణు కుమారుడు అవ్రామ్‌ ఈ చిత్రంలో మంచు విష్ణు పోషించిన తిన్నడు, చిన్నప్పటి రోల్‌లో యాక్ట్‌ చేశారు. అలాగే మంచు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానలు కూడా ఈ సినిమాలో మేకింగ్‌లో భాగమైయ్యారు. శ్రీకాళహస్తి పాటలో వీరు కనిపిస్తారు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను పాన్‌ ఇండియా స్థాయిలో ఈ జూన్‌ 27న (Manchu vishnu Kannappa Release) రిలీజ్‌ చేస్తున్నారు. స్టీఫెన్‌ దేవస్సీ ఈ సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను (Manchu vishnu Kannappa Trailer) రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

 

‘‘నన్ను మించిన శివభక్తుడా? ఈ సృష్టిలోనే లేడు’ (మోహన్‌బాబు)
‘‘శివయ్యా అని మనసారా పిలువు..’ (ప్రభాస్‌)
‘‘అది ఈ జన్మలో జరగదు’’ (మంచు విష్ణు)
‘‘ఇలాంటి వాడు మీకు భక్తుడు అవుతాడని నమ్మకం ఏంటి…ప్రభు’ (కాజల్‌ అగర్వాల్‌)
‘‘నేను దానికోసమే ఎదురుచూస్తున్నాను..రుద్ర’ (అక్షయ్‌కుమార్‌)
‘శివలీల…’ (ప్రభాస్‌)

వంటి డైలాగ్స్‌ కన్నప్ప సినిమా ట్రైలర్‌లో ఉన్నాయి. ఈ సినిమాలోని ప్రధాన పాత్రలందరికీ ఒక్కో డైలాగ్‌ చొప్పున బాగానే స్పేస్‌ ఇచ్చారు ట్రైలర్‌. ముఖ్యంగా ప్రభాస్‌ పోషించిన రుద్ర పాత్రను హైలైట్‌ చేస్తూ, ట్రైలర్‌ను కట్‌ చేసినట్లుగా తెలుస్తోంది. విడుదలైన ‘కన్నప్ప’ ట్రైలర్‌ మాత్రం సినిమాపై ప్రస్తుతం ఉన్న అంచనాలను అయితే పెంచగలిగింది.

Please Share
3 Comments
ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi