కర్మణ్యే వాధికారస్తే…కేవలం పని చేసే హక్కు మాత్రమే..!

Viswa
Karmanye Vadhikaraste Septem Release

Web Stories

బ్రహ్మాజీ, శత్రు, ‘మాస్టర్’ మహేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఇన్వెస్టిగేటివ్‌ సస్సెన్స్‌ అండ్‌ మిస్టరీ థ్రిల్లర్‌ చిత్రం ‘కర్మణ్యే వాధికారస్తే’ (Karmanye Vadhikaraste). బెనర్జీ, పృథ్వీ, శివాజీ రాజా, అజయ్ రత్నం, శ్రీ సుధా ఈ సినిమాలోని ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. అమర్ దీప్ చల్లపల్లి దర్శ కత్వంలో ఈ చిత్రాన్ని ఉషస్విని ఫిలిమ్స్ పతాకంపై డి ఎస్ ఎస్ దుర్గా ప్రసాద్ నిర్మించారు. ఇటీవలే మధుర ఆడియో ద్వారా ఈ చిత్రం ట్రైలర్‌ విడుదలైంది. ఇప్పుడు ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ‘కర్మణ్యే వాధికారస్తే’ సినిమాను సెప్టెంబర్ 19 న విడుదల చేయ నున్నట్లుగా మేకర్స్‌ ప్రకటించారు.

మళ్లీ మళ్లీ కలిసేలా …నచ్చావే చాలా చాలా…….

”కర్మణ్యే వాధికారస్తే’ అంటే “”పని చేసే హక్కు నీకుంది, ఫలితాల మీద కాదు” అనేది అర్థం. భారతీయ ఇతీహాసం భగవద్గీత లోని ఒక పదం. ఈ టైటిల్ కి అనుగుణంగా కథ కూడా చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. కథకు తగ్గట్లుగా బ్రహ్మాజీ, శత్రు, ‘మాస్టర్’ మహేంద్రన్ వారి నటనతో ఈ సినిమాకు ప్రాణం పోశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, ఈ సినిమాను సెప్టెంబరు 19న రిలీజ్‌ చేస్తున్నాం. ఈ చిత్రంతో కృష్ణ భట్, ఇరా దయానంద్, అయేషా, రెహానా ఖాన్ ఫిల్మ్‌ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు” అని చిత్రంయూనిట్‌ పేర్కొంది.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi