వైజాగ్‌లో ఆనంద నిలయం?

Viswa

Web Stories

Venkatesh 77th film:: హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ సినిమా రానుంది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రారంభం కావాల్సిన ఈ సినిమా షూటింగ్‌ కాస్త ఆలస్యమైంది.

కాగా, లేటెస్ట్‌గా ఈ సినిమా చిత్రీకరణకు సంబంధించిన ఫోటోషూట్‌ ఈ బుధవారం హైద రాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగిందని తెలిసింది. ఈ నెలాఖర్లో ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీనిధిశెట్టి యాక్ట్‌ చేయనున్నారని తెలిసింది. ఈ ఫోటో షూట్‌లో శ్రీనిధిశెట్టి కూడా పాల్గొన్నారు.
త్వరలోనే ఓ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాకపోతే త్రివిక్రమ్‌ సినిమాల్లో సాధారణంగా ఇద్దరు హీరోయిన్స్‌ ఉంటుంటారు. ఈ సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్స్‌ ఉంటారట. మ రి..శ్రీనిధిశెట్టి మెయిన్‌ హీరోయిన్‌గా కనిపిస్తారా? లేక సెకండ్‌ హీరోయిన్‌గా చేస్తారా? అనే విషయంపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది.

వెంకటేశ్‌ కెరీర్‌లోని ఈ 77వ సినిమాకు ‘ఆనంద నిలయం’, ‘వెంకటరమరణ’, ‘వెంకటరమణ కేరాఫ్‌ ఆనంద నిలయం’ అనే టైటిల్‌ను మేకర్స్‌ పరిశీ లిస్తున్నారని తెలిసింది. ఈ సినిమా కథ నం కూడా వైజాగ్‌ నేపథ్యంతో సాగుతుందట. గతంలో త్రివిక్రమ్‌ రైటర్‌గా పనిచేసి, వెంకటేశ్‌ హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్‌ చిత్రాలు ‘నవ్వు నాకు నచ్చావ్, మళ్లీశ్వరి’ చిత్రాలకు కూడా వైజా గ్‌ నేపథ్యం ఉన్న సంగతి తెలిసిందే.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi