Vijay Deverakonda Rowdyjanardhana FirstLook: విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు ‘రౌడీ జనార్ధన’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ‘రాజావారురాణిగారు’ సినిమా ఫేమ్ రవికిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహి స్తున్నాడు. ఈ చిత్రంలోకీర్తీ సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. మహారాష్ట్ర సరిహద్దుల్లో కొంత చిత్రీకరణ జరిపారు. తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ ‘రౌడీ జానర్థన’ సినిమా వచ్చే ఏడాది డిసెంబరులో థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.
‘‘బండెడన్నం తిని, గుండెడు రక్తం తాగే రాక్షసుడు గురించి ఎప్పుడైనా విన్నావా…నేను చూశాను.
కొమ్ముల్తో వాడి కథను వాడే రాసుకున్నోడు..కన్నీళ్ళను ఒంటికి నెత్తుర్లా పూసుకున్నోడు…
చావు కళ్ళముందుకొచ్చి నిలబడితే..కత్తై లేచి కలబడినోడు…కనపడ్డాడు..నా లోపల…’
నాకాడా ఉన్నారు..కొమ్ములి తిరిగిన రాక్షసులు..రక్తానికి మరిగిన రౌడీలు..
హా..హా.హా
‘కలింగపట్నంలో ఇంటొకక లం..కొడుకు..రౌడీనని చెప్పుకు తిరుగుతాడు.. కానీ ఇంటిపేర్నే రౌడీగా మార్చుకున్నోడు ఒక్కడే ఉన్నాడు..జనార్థన..రౌడీ జనార్థన’ అనే డైలాగ్స్ ఈ ‘రౌడీ జానర్థన’ సినిమా టైటిల్ గ్లింప్స్‌లో ఉన్నాయి.
1980 నేపథ్యంతో ఈస్ట్ గోదావరి రిజీయన్‌లో ‘రౌడీ జనార్ధన’ సినిమా కథనం సాగుతుంది. ఈ చిత్రంలో విజయ్‌దేవరకొండ ఈస్ట్ గోదావరి యాసలో మాట్లాడతారు. ఈ చిత్రంలోని విజయ్‌దేవరకొండ స్లాంగ్ కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఈ చిత్రం దర్శకుడు రవికిరణ్‌కోలా చెప్పారు.

Hey there, been hitting up 7m ma cao lately. Keeps me in the loop on the scores. Good shout if you’re following the action!
Want the app? kkkjiliappdownload got you covered! Fast and easy.