Thalaivar173 Director CibiChakaravarthi: కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం ఎట్టకేలకు రజనీకాంత్ 173 (Thalaivar173 )వ సినిమాకు దర్శకుడు ఖరారై య్యాడు. రజనీకాంత్ హీరోగా కమల్‌హాసన్ నిర్మాతగా ఓ సినిమా చిత్రీకరణ ప్రారంభం కావాల్సింది. ఈ సినిమాకు తొలుత లోకేష్ కగనరాజ్‌ను దర్శకుడిగా ఎంచుకున్నారు. కానీ ఆ తర్వాత సుందర్.సి పేరు తెరపైకి వచ్చింది. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల, ఈ సినిమా నుంచి దర్శకుడు సుందర్.సీ కూడా తప్పుకు న్నారు.
దీంతో రజనీకాంత్ 173వ సినిమాకు ఎవరు దర్శకత్వం వహించబోతున్నారు? అనే చర్చ కోలీవుడ్‌లో బలంగా వినిపించింది. ప్రదీప్ రంగనాథన్, రామ్‌కుమార్, బక్కియరాజ్ కన్నన్, వివేక్ ఆత్రేయ…వంటి పలువురు దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఫైనల్‌గా రజనీకాంత్ 173వ సినిమాకు సిబీ చక్రవర్తి (Thalaivar173 Director CibiChakaravarthi) దర్శకత్వం వహించనున్నాడు. శనివారం మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అలాగే ఓ స్పెషల్ వీడియోను కూడా రిలీజ్ చేశారు.
ఇక శివకార్తీకేయన్‌తో ‘డాన్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తీశాడు దర్శకుడు సిబీ చక్రవర్తి. ఇలా దర్శకుడితో తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా తర్వాత రజనీకాంత్‌కు అప్పట్లోనే ఓ కథ వినిపించాడు సిబీ చక్రవర్తి. కానీ ఈ సినిమా ఫైనలైజ్ కాలేదు. మళ్లీ శివకార్తీకేయన్‌తోనే సినిమా ఒకే అయ్యింది. కానీ లోపు రజనీకాంత్ నుంచి సిబీ చక్రవర్తికి ఫోన్ కాల్ రావడం, ఈ ప్రాజెక్ట్ ఒకే కావడం, చకచక జరిగిపో యాయి.
ఇక శివకార్తీకేయన్ నటించిన గత చిత్రం ‘అమరన్’ పెద్దబ్లాక్‌బస్టర్. ఈ సినిమాకు కమల్‌హాసన్ నిర్మాత. ఇప్పుడు రజనీకాంత్ 173వ సినిమాకూ కమల్‌హాసన్ నిర్మాత. సో..శివకార్తీకేయన్ నుంచి సిబీ చక్రవర్తికి ఏటువంటి అబ్లిగేషన్స్ లేకుండ, రజనీకాంత్–సిబీ చక్రవర్తి ప్రాజెక్ట్‌కు కమల్‌హాసన్ లైన్‌క్లియర్ చేసినట్లుగా తెలుస్తుంది.
ఇక రజనీకాంత్ 173వ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. అనిరు«ద్‌రవిచందర్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్. ఇక రజనీకాంత్ హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ ‘జైలర్ 2’ చిత్రం ఈ ఏడాది జూన్‌లో విడుదల కావొచ్చని తెలిసింది.
AE888l1, alright! Let’s see what games are worth playing. Let hit it and see if we are any luck!ae888l1