పుష్పరాజ్‌ను దాటిన ధురంధర్‌

Viswa

Web Stories

dhurandhar Collections: రణ్‌వీర్‌సింగ్‌ హీరోగా నటించిన హిందీ ‘ధురంధర్‌’ సినిమా సరికొత్త బాక్సాఫీస్‌ రికార్డ్స్‌ను క్రియేట్‌ చేస్తుంది. ఆదిత్యా ధార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ 2025 డిసెంబరు 5న థియేటర్స్‌లో విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1200 కోట్ల రూపాయాలకు పైగా కలెక్షన్స్‌ సాధించి (Dhurandhar worldwide gross,), బ్లాక్‌బస్టర్‌గా దూసుకెళ్తూ, ఇంకా థియేటర్స్‌లో సక్సెస్‌ఫుల్‌ ప్రదర్శించబడుతుంది (Dhurandhar box office)

అయితే ‘ధురంధర్‌’ సినిమా ఇండియాలో రూ. 831.40 కోట్ల రూపాయాల కలెక్షన్స్‌ వచ్చాయని (dhurandhar Collections) ఈ చిత్రం నిర్మాణంలో భాగమైన జీయో స్టూడియో సంస్థ తెలిపింది. ఈ ప్రకారం ఇండియాలో అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా ‘ధురంధర్‌’ నిలిచింది. అలాగే కేవలం ఒకే భాషలో విడుదలై, ఈ స్థాయి కలెక్షన్స్‌ సాధించిన హిందీ చిత్రం కూడా ‘ధురంధర్‌’యే కావడం మరో విశేషం. ఇక గతంలో హిందీలో అత్యధిక వసూళ్ళు సాధించిన రికార్డు అల్లు అర్జున్‌ ‘పుష్ప 2’ చిత్రంపై ఉండేది. ఇప్పుడు ఈ రికార్డు తుడిచిపెట్టుకు పోయింది. ‘ధురంధర్‌’ హవా చూస్తుంటే, బాక్సాఫీస్‌ వద్ద మరిన్ని కొత్త రికార్డులు నెలకోల్పేలా కనిపిస్తోంది (hurandhar collections).

ఇక ధరుంధర్‌ సినిమాలో రణ్‌వీర్‌సింగ్‌ హీరోగా నటించగా, మాధవన్, అక్షయ్‌ఖన్నా, సారా అర్జున్, అర్జున్‌ రాంపాల్, సంజయ్‌దత్‌లు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ‘ధురంధర్‌ 2’ చిత్రం కూడా మార్చి 19న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos