please subscribe to Tollywoodhub YouTube channel

Saipallavi: ఇకపై ఊరుకునేది లేదు…సాయిపల్లవి మాస్‌ వార్నింగ్‌

Viswa
1 Min Read

Web Stories

Saipallavi: అగ్రశ్రేణి హీరోయిన్‌ సాయిపల్లవి ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఇకపై తనపై రూమర్స్‌ను స్ప్రెడ్‌ చేస్తే ఊరుకునేది లేదని ఆమె ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొన్నారు. అసలు…ఏం జరిగిదంటే…రణ్‌బీర్‌కపూర్‌ హీరోగా హిందీలో ‘రామాయణ’ సినిమా తీస్తున్నారు. ఇందులో సాయిపల్లవి సీత పాత్రలో నటిస్తున్నారు. అయితే సీత పాత్ర కోసం సాయిపల్లవి తన అలవాట్లను మార్చుకున్నారని, ముఖ్యంగా ఆహారం విషయంలో మార్పులు చేసుకున్నారనే వార్తలను ఓ కోలీవుడ్‌ మీడియా రాసుకొచ్చింది. ఈ విషయంపై సాయిపల్లవి మండిపడుతున్నారు.

Rashmika Mandanna: ది గార్ల్‌ఫ్రెండ్‌కు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చిన విజయ్‌ దేవకరొండ

‘‘నా గురించి ఫేక్‌ వార్తలు వచ్చిన ప్రతిసారి నేను మౌనంగానే ఉంటున్నాను. నా గురించి కల్పిత వార్తలను రాసిన కూడా నేను సైలెంట్‌గానే ఉన్నాను. ఈ విషయం ఆ దేవుడికి తెలుసు. కానీ ఇది మళ్లీ మళ్లీ జరుగు తూనే ఉంది. అందుకే ఇప్పుడు రియాక్ట్‌ అవుతున్నాను. మరీ ముఖ్యంగా నా సినిమాల ప్రకటనలు, నా సినిమాల రిలీజ్‌లు, నా జీవితంలోని ముఖ్య సంఘటనలు జరిగినప్పుడు నాపై వార్తలు ప్రచారంలోకి వస్తు న్నాయి. కానీ ఇకపై మాత్రం మౌనంగా ఉండాలనుకోవడం లేదు.నాపై తప్పుడు వార్తలు ప్రచురించిన, ట్రోలింగ్‌ చేసినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను’’ అని సాయిపల్లవి పేర్కొన్నారు.

Vijaydevarakonda in Pushpa3: పుష్ప3లో విజయ్‌దేవరకొండ?

ఇక సాయిపల్లవి హిందీలో ‘రామాయణ’ సినిమాతో పాటుగా, తమిళ హిట్‌ ‘లవ్‌టుడే’ సినిమా హిందీ రీమేక్‌లో హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే నాగచైతన్య ‘తండేల్‌’ సినిమాలో హీరోయిన్‌గా నటించారు. ‘తండేల్‌’ సినిమా ఫిబ్రవరి7న, హిందీ చిత్రాలు వచ్చే ఏడాదిలో రిలీజ్‌ కానున్నాయి.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi