నవీన్‌ పొలిశెట్టి అనగనగా ఒకరాజు ఫస్ట్‌ రివ్యూ

Viswa

Web Stories

Anaganaga Oka Raju Movie First Review: ‘జాతిరత్నాలు’ వంటి బ్లాక్‌బస్టర్, ‘మిస్‌శెట్టి మిస్టర్‌పొలిశెట్టి’ వంటి డీసెంట్‌ హిట్‌ తర్వాత హీరో నవీన్‌ పొలిశెట్టి నుంచి మరో సినిమా ఆడియన్స్‌ ముందుకు రాలేదు. నవీన్‌ పొలిశెట్టి నుంచి కొత్త సినిమా వచ్చి, దాదాపు రెండున్నర సంవత్సరాలు అవుతుంది. అయితే ఈ సంక్రాంతికి ‘అనగనగా ఒకరాజు’ వంటి కామెడీ ఎంటర్‌టైనర్‌ ఫిల్మ్‌తో నవీన్‌ పొలిశెట్టి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్‌ కమ్‌ ప్రమోషనల్‌ కంటెంట్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలానే ఉంది. మారి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌ మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న థియేటర్స్‌లో రిలీజ్‌ అవుతుంది. మరి..ఈ సినిమా ఎలా ఉండబోతుంది? అనే అంశంపై ఓ లుక్‌ వేద్దాం (Naveen Polishetty Anaganaga Oka Raju first review).

Naveen polishetty Anaganaga Oka Raju Movie First Review2

గౌరవపురం జమీందారు గోపరాజుగారి మనవడు రాజు పాత్రలో కనిపిస్తాడు నవీన్‌ పొలిశెట్టి. సంపన్న కుంటుబానికి చెందిన భూపతిరాజు (రావు రమేష్‌) కుమార్తె చారులతగా నటించారు మీనాక్షీ చౌదరి. తన ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌తో కలిసి లైఫ్‌ని సరదగా ఎంజాయ్‌ చేసే రాజు ప్రేమలో పడతాడు. చారులతను ప్రేమిస్తాడు. చారులతను ప్రేమించడానికి కష్టాలు పడి, ఫైనల్‌గా లవ్‌ పడేస్తాడు. కానీ వీరి పెళ్లికి మరో సమస్య ఏర్పడుతుంది(Anaganaga Oka Raju story review). అది ఏంటి అనేది? సినిమాలో (Anaganaga Oka Raju movie first review) చూడాలి.

ఈ సినిమా అంతా చాలా సరదా సరదాగా సాగిపోతుందని తెలుస్తుంది. రాజుగా నవీన్‌ పొలిశెట్టి కామెడీ టైమింగ్, తన ఫ్రెండ్స్‌ (రచ్చ రవి, రంగస్థలం మహేష్, భద్ర)లతో కలిసి రాజు చేసే సందడి, ఈ సినిమాకు పెద్ద ప్లస్‌ పాయింట్స్‌గా ఉండబోతున్నాయని తెలిసింది. అలాగే చాలా అమయాకంగా ఉండే చారులత పాత్ర నుంచి కూడా కామెడీ జనరేట్‌ చేశారు. చారులతగా కామెడీ చేసే కొత్త మీనాక్షీని స్క్రిన్‌పై చూస్తారట ఆడియన్స్‌. అలాగే ఓ రెండు డ్యాన్స్‌ నంబర్స్‌ కూడా ఈ సినిమాలో ఆడియన్స్‌కు మంచి హై ఇచ్చేట్లుగా కనిపిస్తున్నాయి. అలాగే ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్‌ ట్రాక్‌ కూడా ఆడియన్స్‌ను మెప్పించేలా ఉంటుం దనే టాక్‌ ప్రచారంలోకి వచ్చింది. మారి డైరెక్షన్‌ బాగానే కుదరిందట. మిక్కీజేమేయర్‌ సంగీతం బాగుం టుందని, ముఖ్యంగా ఆర్‌ఆర్‌ బాగా కుదిరాయట. మరి..ఫైనల్‌గా ఈ సినిమా ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తుందా? లేదా అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్‌ చేయకతప్పదు (Anaganaga Oka Raju pre review).

Please Share
3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos