వచ్చే సంక్రాంతికి శ్రీనువైట్ల సినిమా.. శర్వానంద్ ప్లాన్ మాములుగా లేదుగా!

Kumar NA
2 Min Read

Web Stories

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్‌కు సంక్రాంతి సీజన్ ఒక బాగా కలిసొచ్చింది. గతంలో ‘శతమానం భవతి’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ వంటి బ్లాక్ బస్టర్ హిట్లను సంక్రాంతి బరిలోనే అందుకున్న ఆయన, ఈ ఏడాది ‘నారి నారి నడుమ మురారి’ చిత్రంతో మళ్లీ అదే మ్యాజిక్‌ను రిపీట్ చేశారు. భారీ పోటీ మధ్య విడుదలైనప్పటికీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలకడగా రాణిస్తూ శర్వానంద్‌కు గట్టి కంబ్యాక్‌ను అందించింది. ఈ సక్సెస్ జోష్‌లో ఉన్న శర్వానంద్, తన తదుపరి సినిమాలపై కీలక అప్‌డేట్స్ ఇచ్చారు.

తనకు అచ్చొచ్చిన సంక్రాంతి సీజన్‌ను వదులుకోకూడదని శర్వా నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే 2027 సంక్రాంతికి ఒక భారీ చిత్రాన్ని తీసుకురాబోతున్నట్లు ఆయన ప్రకటించారు. టాలీవుడ్ సీనియర్ దర్శకుడు శ్రీను వైట్ల ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. తాజాగా జరిగిన నారీ నారీ నడుమ మురారి సక్సెస్ మీట్ లో స్వయంగా శర్వానంద్ ఈ ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేయడం విశేషం. అంతేకాదు ఈ సినిమాను కూడా వచ్చే ఏడాది సంక్రాంతి కి తీసుకురాబోతున్నట్లు చెప్పుకొచ్చాడు. శ్రీను వైట్ల మార్క్ వినోదం, శర్వానంద్ నటన తోడైతే వెండితెరపై నవ్వుల పూయడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం, జూన్ నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. కేవలం పండుగ సీజన్లే కాకుండా, వచ్చే ఏడాది (2026) కూడా శర్వానంద్ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఈ సినిమా కంటే ముందే బైకర్, భోగి అనే ప్రాజెక్ట్స్ కమిట్ అయ్యాడు శర్వా. బైకర్ యాక్షన్ నేపథ్యంలో సాగే సినిమా. ఈ మూవీపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో పాటూ సంపత్ నందితో భోగి అనే ప్రాజెక్ట్ కి సైన్ చేసాడు. ఓ లఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా సిద్ధమవుతోంది. ఇలా వరుస సినిమాలు చేస్తూ ఫామ్‌లోకి వచ్చిన శర్వానంద్, విలక్షణమైన కథలను ఎంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు. ముఖ్యంగా శ్రీను వైట్లతో చేయబోయే సినిమాతో 2027 సంక్రాంతికి హ్యాట్రిక్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi