‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాకి మొదట అనుకున్న హీరో ఎవరో తెలుసా?

Kumar NA
2 Min Read

Web Stories

Nari Nari Naduma Murari Hero: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ చాలా కాలం తర్వాత ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద పక్కా కమర్షియల్ సక్సెస్‌ను అందుకున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం, మిగిలిన సినిమాల జోరు తగ్గుతున్నా.. మాంచి వసూళ్లతో దూసుకుపోతోంది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ మార్కును దాటేసిన ఈ సినిమా శర్వానంద్ కెరీర్‌కు మళ్ళీ ఊపిరి పోసింది. అయితే, ఈ సక్సెస్‌ఫుల్ మూవీ వెనుక ఒక ఆసక్తికరమైన ‘ఇన్‌సైడ్ టాక్’ ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో విపరీతంగా వినిపిస్తోంది.

దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ వినోదాత్మక కథను సిద్ధం చేసినప్పుడు తన మనసులో ఉన్న మొదటి హీరో అక్కినేని నాగచైతన్య అట. వాస్తవానికి ఈ స్క్రిప్ట్‌ను నాగచైతన్య కోసమే రాశారని, కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్‌పై పెద్దగా ఆసక్తి చూపించలేదని సమాచారం. చైతూ నో చెప్పడంతో, ఆ తర్వాత పలువురి పేర్లను పరిశీలించిన దర్శకుడు చివరికి శర్వానంద్‌ను ఎంపిక చేశారు. కథ వినగానే శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, అది కాస్తా ఇప్పుడు సంక్రాంతి హిట్ గా నిలవడం విశేషం.

శర్వానంద్ కెరీర్‌ను పరిశీలిస్తే, ‘మహానుభావుడు’ తర్వాత ఆయనకు సరైన కమర్షియల్ హిట్ దక్కలేదు. మధ్యలో ‘ఒకే ఒక జీవితం’ వంటి ప్రయోగాత్మక చిత్రాలకు విమర్శకుల ప్రశంసలు దక్కినా, కమర్షియల్‌గా అవి వర్కవుట్ కాలేదు. దాదాపు 8 సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇప్పుడు సుమారు 9 ఏళ్ల నిరీక్షణ తర్వాత శర్వానంద్ ఖాతాలో ఒక సాలిడ్ హిట్ చేరింది. ఇందులో నరేష్ కామెడీ టైమింగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, వసూళ్ల విషయంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంది. శర్వానంద్ సినిమా కావడం, అంతకుముందు హిట్లు లేకపోవడంతో ఈ మూవీపై పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు. దీనికి తోడు థియేటర్ల కొరత కూడా కలెక్షన్లపై ప్రభావం చూపింది. ఒకవేళ నాగచైతన్య ఈ సినిమా చేసి ఉంటే, ఆయనకున్న క్రేజ్ మరియు మంచి ప్రమోషన్ల తోడై ఈ చిత్రం సులభంగా రూ. 100 కోట్ల క్లబ్ లో చేరేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Please Share
Share This Article
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi