Comrade Kalyan Movie: శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమా (Comrade Kalyan Movie) దసరాకు రిలీజ్ కానుంది. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో కోన వెంకట్ సమర్పణలో వెంకట కృష్ణ కర్నాటి, సీత కర్నాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఆంధ్రా–ఒరిస్సా సరిహద్దు నేపథ్యంతో 1992 బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ చిత్రంలో శ్రీవిష్ణు ద్విపాత్రాభినయం చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. తాజాగా ఈ సినిమాను దసరా ఫెస్టివల్ సందర్భంగా అక్టోబరు 9న (Comrade Kalyan Movie Release date) రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రాధికాశరత్‌కుమార్, షైన్‌టామ్‌చాకో, ఉపేంద్ర లిమాయే ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పలుమార్లు వాయిదా పడింది. మరి…ఈ సారైనా ఈ చిత్రం అక్టోబరు 9న విడుదల అవుతుందా? లేదా? అనేది చూడాలి.