కొరియోగ్రాఫర్ తో ప్రేమలో పడ్డ చిట్టి.. ప్రియుడి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Kumar NA

Web Stories

‘జాతి రత్నాలు’ సినిమాతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ఫరియా అబ్దుల్లా, తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాన్ని పంచుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. నటిగా, డ్యాన్సర్‌గా, ర్యాప్ సింగర్‌గా మల్టీ టాలెంటెడ్‌ అనిపించుకుంటున్న ఈ ‘చిట్టి’, తాను ప్రేమలో ఉన్నట్లు అధికారికంగా వెల్లడించింది. సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తితోనే ప్రేమ
ఫరియా తన మనసు దోచుకున్న వ్యక్తి ఎవరో కాదని, సినీ ఇండస్ట్రీలో వర్కింగ్ లో ఉన్న ఒక యువ కొరియోగ్రాఫర్ అని తెలిపింది. ఒక మతపరంగా తాను ముస్లిం అయినప్పటికీ, ఒక హిందూ అబ్బాయితో డేటింగ్‌లో ఉన్నట్లు ఆమె స్పష్టం చేసింది.

“మా బంధంలో మతాల ప్రస్తావన ఎప్పుడూ రాలేదు. మా ఇద్దరి మధ్య ఉన్న మానసిక అనుబంధమే మాకు ముఖ్యం. ఇది కేవలం ఒక ప్రేమ వ్యవహారం మాత్రమే కాదు, ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే జీవితకాల భాగస్వామ్యం” అని ఆమె తన పరిణతిని చాటుకుంది. కేవలం నటిగానే కాకుండా, ఫరియాలో ఉన్న ఇతర కళలను వెలికితీయడంలో ఆమె ప్రియుడి పాత్ర ఎంతో ఉందని ఆమె చెప్పుకొచ్చింది. ఫరియా ఈ మధ్య కాలంలో మ్యూజిక్ వీడియోలు, ర్యాప్ సాంగ్స్ మరియు డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. దీని వెనుక తన ప్రియుడి ప్రోత్సాహం, సలహాలు ఎంతో ఉన్నాయని ఆమె వెల్లడించింది. తామిద్దరం కేవలం ప్రేమలో ఉండటమే కాకుండా, వృత్తిపరంగా కూడా ఒక టీమ్‌లా కలిసి పని చేస్తామని, ఆయన ఇచ్చే సలహాలు తన కెరీర్ ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని ఫరియా పేర్కొంది.

ఫరియా తన లవ్ స్టోరీని బయటపెట్టినప్పటికీ, ఆ కొరియోగ్రాఫర్ ఎవరనేది మాత్రం సస్పెన్స్‌గా ఉంచింది. దీంతో సోషల్ మీడియాలో ఆ లక్కీ మ్యాన్ ఎవరై ఉంటారా? అనే అన్వేషణ మొదలైంది. త్వరలోనే అతడిని అందరికీ పరిచయం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. తన మనసులోని మాటను ధైర్యంగా చెప్పిన ఫరియాకు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఆ యంగ్ కొరియోగ్రాఫర్ ఎవరో తెలియాలంటే ఆమె స్వయంగా ప్రకటించే వరకు ఆగాల్సిందే!

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi