నిఖిల్‌ స్వయంభూ సినిమా విడుదల వాయిదా

Viswa

Web Stories

Swayambhu Movie Postponed: నిఖిల్‌ హీరోగా నటించిన ‘స్వయంభూ’ (Swayambhu Movie) సినిమా విడుదల మరింత ఆలస్యం కానుంది. ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా సినిమాను గత ఏడా దే రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ ఈ సినిమా చిత్రీకరణ కాస్త ఆలస్య మైంది. దీంతో ఈ ఫిబ్రవరి 13న రిలీజ్‌ ప్లాన్‌ చేశారు. కానీ ‘స్వయంభూ’ ఈ సినిమా తేదీకి విడుదల కావడం లేదు (Telugu cinema Updates).

‘స్వయంభూ’ సినిమాను ఏప్రిల్‌ 10న విడుదల విడుదల చేయనున్నారు. కొత్త రిలీజ్‌ డేట్‌ను ఫిక్స్‌ చేశారు. ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా సినిమా రాజుల కథ నేపథ్యంలో సాగుతుంది. ‘బాహుబలి’ సినిమా తరహాలో అన్నమాట. ఈ సినిమా కథ ప్రధానంగా ఓ రాజదండం నేపథ్యంతో సాగుతుందని తెలిసింది. ఈ సినిమా రెండు పార్టులుగా విడుదల కానుందని తెలిసింది. తొలిపార్టు ఈ ఏప్రిల్‌ 10న (Swayambhu Movie Release date) విడుదల కానుంది (Telugu cinema news).

ఈ సినిమాతో భరత్‌కృష్ణమాచారి అనే నూతన దర్శకుడు తెలుగు చిత్రపరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రంలో నభానటేష్‌, సంయుక్త హీరో హీరోయిన్లుగా నటించారు (Swayambhu Movie Cast and crew). సంయుక్త ఓ వారియర్‌ రోల్‌ చేశారు. హీరోయిన్‌ నభానటేష్‌ నటించినట్లుగా తెలుస్తుంది. భారీ బడ్జెట్‌తో ‘స్వయంభూ’ సినిమాను ఠాగూర్‌ మధు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కాకుండ ‘ది ఇండియాహౌస్‌’ అనే పీరియాడికల్‌ మూవీ చేస్తున్నాడు. షూటింగ్‌ జరుగుతోంది. అలాగే ఈ ఏడాది ‘కార్తికేయ 3’ సినిమా చిత్రీకరణ కూడ ప్రారంభం కానున్నట్లుగా తెలుస్తుంది (Telugu cinema Latest news).

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos