మారుతిని వదలని ప్రభాస్ ఫ్యాన్స్.. ఏకంగా ఇంటికే వెళ్లి?

Kumar NA

Web Stories

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవడంతో, ఆ ప్రభావం దర్శకుడు మారుతి వ్యక్తిగత జీవితంపై పడటం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సినిమాకు మిక్స్‌డ్ టాక్ రావడంతో అభిమానులు సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు దిగడమే కాకుండా, ఇప్పుడు ఏకంగా ఆయన ఇంటినే లక్ష్యంగా చేసుకుని వింత రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్‌లోని కొండాపూర్‌ ప్రాంతంలో ఉన్న ‘కొల్లా లక్సురియా’ విల్లాస్‌లో నివసిస్తున్న మారుతికి, గత కొన్ని రోజులుగా ఊహించని తలనొప్పి వచ్చి పడింది. ఎవరో అజ్ఞాత వ్యక్తులు మారుతి పేరుతో జొమాటో, స్విగ్గీ ద్వారా భారీగా ఫుడ్ ఆర్డర్లను పంపిస్తున్నారు. కేవలం ఆహారమే కాకుండా, మెడికల్ షాపుల నుంచి వివిధ రకాల వైద్య పరికరాలను కూడా ఆయన అడ్రస్‌కే ఆర్డర్ చేస్తున్నట్లు సమాచారం. ఒక్క రోజులోనే సుమారు 100కు పైగా డెలివరీ ఆర్డర్లు రావడంతో విల్లా సెక్యూరిటీ సిబ్బంది హతాశులయ్యారు. ప్రతి డెలివరీ బాయ్‌ను అడ్డుకోవడం, మారుతికి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకోవడం వారికి పెద్ద పనిగా మారింది. ఈ వింత వేధింపులతో విసిగిపోయిన దర్శకుడు మారుతి, చివరికి ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారు.

సెక్యూరిటీ సిబ్బందితో మాట్లాడిన మారుతి, తాను ఎలాంటి ఆర్డర్లు పెట్టలేదని స్పష్టం చేస్తూ.. ఇకపై తన పేరు మీద ఏ వస్తువు వచ్చినా లోపలికి అనుమతించవద్దని కరాఖండిగా చెప్పారు. సినిమా నచ్చకపోతే విమర్శించవచ్చు కానీ, ఇలా వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించి ఇబ్బందులకు గురి చేయడం సరైన పద్ధతి కాదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక సినిమా ఫలితం అనేది దర్శకుడికి, నటుడికి పాఠం నేర్పుతుంది. కానీ, ఇలాంటి విపరీత ధోరణులు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. మారుతి తన తదుపరి చిత్రాలతో ఈ విమర్శలకు సమాధానం చెబుతారో లేదో చూడాలి.

Please Share
1 Comment
  • Выездная бригада «МедОпоры» дежурит 24/7 и покрывает весь Красногорск и близлежащие районы. После короткого звонка дежурный уточняет длительность запоя, сопутствующие болезни, принимаемые препараты и аллергии — это экономит время на месте и помогает заранее предусмотреть риски. Врач приезжает с комплектом одноразовых систем, растворами и медикаментами, проводит экспресс-диагностику: измерение давления, пульса, сатурации, температуры, оценка неврологического статуса, степени обезвоживания и тревожности. По этим данным формируется индивидуальная схема инфузий и симптоматической поддержки. Наша задача — не просто «поставить капельницу», а безопасно развернуть план стабилизации, где дозировки и темп меняются по реакции организма. Если выявляются признаки осложнений или дома нет условий для безопасного наблюдения, сразу предлагаем перевод в профильный стационар, чтобы не терять драгоценные часы. Семья получает понятные роли и инструкции, а врач остаётся на связи для уточнений по режиму ближайшей ночи.
    Подробнее – https://vyvod-iz-zapoya-krasnogorsk10.ru/vyvod-iz-zapoya-na-domu-v-krasnogorske

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos