Vaa Vaathiyaar ott : కార్తి హీరోగా నటించిన ‘వా వాతియార్’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. నలన్ కుమారస్వామి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కృతీశెట్టి హీరోయిన్‌గా నటించారు. కేజీ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రాన్ని 2025 డిసెంబరు 5న విడుదల కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ‘వా వాతియర్’ సినిమాను 2025 డిసెంబరు 12న రిలీజ్‌కు రెడీ చేశారు.
కానీ చివరి నిమిషంలో కొన్ని ఆర్థికపరమైన కారణాల వల్ల 2025 డిసెంబరు 12న ఈ సినిమా విడుదల కాలేదు. ఫైనల్‌గా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ఈ సినిమాను తమిళంలో విడుదల చేస్తారు. కానీ ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి సరైన స్పందన లభించలేదు (Vaa Vaathiyaar ott).

అయితే ఈ సినిమా విడుదలైన 14 రోజులకే, ఈ చిత్రం అమెజాన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది (Vaa Vaathiyaar OTT release).
‘వా వాతియార్’ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో జనవరి 28 (Vaa Vaathiyaar Release date Prime Video) నుంచి స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఇక ఈ సినిమాను తెలుగులో ‘అన్నగారు వస్తారు’ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. కానీ ఈ సినిమా తెలుగు వెర్షన్ థియేటర్స్‌లో రిలీజ్ కాలేదు. డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్‌కు సిద్ధమౌతుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ కానుంది (Vaa Vaathiyaar OTT release).