హాలీవుడ్‌ రీమేక్‌ సినిమాలో రజనీకాంత్‌?

Viswa

Web Stories

Thalaiver173 update: రజనీకాంత్‌ హీరోగా సిబీ చక్రవర్తి డైరెక్షన్‌లో ఓ మూవీ రానుంది. రజనీకాంత్‌ కెరీర్‌లోని ఈ 173వ సిని మాను కమల్‌హాసన్‌ నిర్మిస్తారు. ఈ చిత్రాన్ని నిర్మించడంతో పాటుగా, ఈ సినిమాలో ఓ చిన్న గెస్ట్‌ రోల్‌ కూడా కమల్‌హాసన్‌ చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు కోలీవుడ్‌లో వినిపిస్తున్నాయి.

ఇక ఈ సినిమా చిత్రీకరణ ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రీపొడక్షన్‌ వర్క్స్‌ జరుగు తున్నాయి. నటీనటుల ఎంపిక కూడా మొదలైంది. ఈ సినిమాలోకి ఓ కీలక పాత్రలో సాయిపల్లవి నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.

ఈ సంగతి ఇలా ఉంచితే..రజనీకాంత్‌ 173వ సినిమాలో ఓ టైలర్‌ పాత్రలో నటించనున్నారనే టాక్‌ తెరపైకి వచ్చింది. అమెరికన్‌ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ డ్రామా ‘ది అవుట్‌ఫిట్‌’ సినిమాకు తమిళ రీమేక్‌గా ఈ సినిమా ఉండబోతుందనే టాక్‌ కోలీవుడ్‌లో వినిపిస్తుంది.అయితే ఈ విషయంపై పూర్తిస్థాయి సమాచారం అందాల్సి ఉంది. వచ్చే పొంగల్‌కి ఈ సినిమాను రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇక రజనీకాంత్‌ నటించిన తాజా చిత్రం ‘జైలర్‌’. ఈ సినిమా ఈ ఏడాది జూన్‌లో రిలీజ్‌ కానుంది. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ ఈ సినిమాకు దర్శకుడు. రజనీ–నెల్సన్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘జైలర్‌’ సినిమాకు సీక్వెల్‌గానే ‘జైలర్‌ 2’  (Jailer2 news) చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos