మలయాళ హిట్‌ మూవీ సర్వం మాయ రివ్యూ (ఓటీటీ)..మోడ్రన్‌ దెయ్యం డెలులు ఏం చేసింది?

Viswa

Web Stories

ఇటీవలి కాలంలో వచ్చిన చాలా మలయాళ సినిమాలు తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ కోవలో గత ఏడాది క్రిస్మస్‌ సందర్భంగా థియేటర్స్‌లో విడుదలైన మలయాళ సినిమా ‘సర్వంమాయ’. నివిన్‌ పౌలి హీరోగా చేసిన ఈ సినిమా, రూ. 100 కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్ట్‌ చేయడం విశేషం. తన తొలి మూవీతోనే అఖిల్‌ సత్యన్‌ సత్తా చాటి, సూపర్‌హిట్‌ అందుకున్నాడు. ఇప్పుడు ఈ సర్వంమయ సినిమా హాట్‌స్టార్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. మరి..ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చదివేయండి (Sarvam Maya OTT)

.

సినిమా: సర్వం మాయ (Sarvam Maya review)

ప్రధాన తారాగణం: నివిన్‌పౌలి, రియాశిబు, అజు వర్గీస్, జనార్థన్, ప్రీతి ముకుందన్‌ (Sarvam maya cast and crew)
డైరెక్టర్‌: అఖిల్‌ సత్యన్‌ (Akhil Sathyan Sarvam maya Director)
నిర్మాణం: రాజీవ్‌ మీనన్, అజయ్‌కుమార్‌
సంగీతం: జస్టిన్‌ ప్రభాకరన్‌
కెమెరా: శరణ్‌ వేలాయుధన్‌
ఎడిటింగ్‌: అఖిల్‌ సత్యన్, రథిన్‌ రాధాకృష్ణన్‌
నిడివి: 2 గంటల 26 నిమిషాలు
స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌: జీయోహాట్‌స్టార్‌
స్ట్రీమింగ్‌ తేదీ: జనవరి 30, 2026

రేటింగ్‌: 2.75/5 (Sarvam Maya Malayalam Movie ott Review and Rating)

Sarvam Maya Malayalam Movie Story:కథ

ప్రభేందు (నివిన్‌ పౌలి) బ్రహ్మాణ కుటుంబంలో జన్మించిన యువకుడు. పందొమ్మిది సంవత్సరాల వయసు వరకు వేదాలు చదువుకున్నాడు. కానీ ఓ సంఘటనతో అతనికి దైవభక్తిపై నమ్మకం పోయింది. ఈ విషయంలో అతని తండ్రికి, అతనికి భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. దీంతో కుటుంబానికి దూరంగా ఉంటూ, జీవనం సాగిస్తుంటాడు ప్రభేందు. జీవితంలో గిటారిస్ట్‌గా పెద్ద మ్యూజిషియన్‌గా సెటిల్‌ అవ్వాలనుకున్నది అతని కల. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తుంటాడు. ముంబైలో ఉంటూ ఓ మ్యూజిక్‌ ట్రూప్‌లో ఓ సభ్యుడిగా ఉంటాడు. ఈ మ్యూజిక్‌ట్రూప్‌ యూరప్‌ టూర్‌కు వెళ్లాల్సి ఉండగా, ప్రభేందుకు విసా రాదు (Sarvam Maya Review).

దీంతో సొంత ఖర్చులకు డబ్బులు లేక ఇంటికి వస్తాడు. డబ్బులు కోసం అతని బంధువు రూపేస్‌ దగ్గర అసిస్టెంట్‌గా జాయిన్‌ అవుతాడు ప్రభేందు. వీరిద్దరు కలిసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, సంభావణ తీసుకుంటుంటారు. ఓ సారి రూపేస్‌కు యాక్సిడెంట్‌ జరుగుతంది. దీంతో ప్రభేందు ఒక్కడే పూజ యాగం చేయాల్సి ఉంటుంది. కానీ ఇది వారు చేసే రెగ్యులర్‌ యాగం కాదు. ఓ టీనేజ్‌ కుర్రాడికి ఓ భూతాన్ని వదలించే యాగం. ఈ తరహా యాగం చేయడం ప్రభేందుకు కొత్త. ఈ యాగం తర్వాత డిలేలు అనే అమ్మాయి దెయ్యం అతని వెంట పడుతుంది. ఈ దెయ్యం కేవలం ప్రభేందుకు మాత్రమే కనిపిస్తుంటుంది. ఈ దెయ్యానికి తాను ఎవరో, తన పేరు ఏంటో..ఈ ఏవేవీ తెలియవు. ఈ మోడ్రన్ దెయ్యం తన గురించి తాను తెలుసుకోవాలనుకుంటుంది. మరి…ఈ దెయ్యం భారీ నుంచి ప్రభేందు ఎలా భయటపడ్డాడు? ప్రభేందు జీవితంలో తాను అనుకున్నది సాధిం చాడా? ప్రభేందుకు ఎందుకు దైవభక్తిపై నమ్మకం పోయింది? తండ్రితో ఎందుకు మాట్లడడు? దెయ్యంగా డిలేలు అసలు కథ ఏమిటి? (Sarvam Maya Malayalam Movie telugu review) అన్న ఆసక్తికరమైన పాయింట్స్‌ను సినిమాలో చూడాలి (Sarvam Maya JioHotstar).

ఓం శాంతి శాంతి శాంతిః రివ్యూ… 6 నెలల్లో భార్యను భర్త 26 సార్లు కొడితే….

విశ్లేషణ

దెయ్యం బ్యాక్‌డ్రాప్‌లో మన తెలుగులో చాలా హారర్‌ కామెడీ సినిమాలొచ్చాయి. సీరియస్‌ హారర్‌ మూవీస్‌ చూశాం. కానీ ఇదొ డిఫరెంట్‌ పాయింట్‌. దేవుడంటేనే నమ్మకం లేని ఓ బ్రహ్మణ యువకుడు పూజలు చేస్తుండటం, ఇతనికి ఓ క్రిస్టియన్‌ అమ్మాయి దెయ్యంగా పరిచయమవ్వడం…దర్శకుడు తరహా పాయిం ట్‌ను ఎంచుకున్నప్పుడే సగం సక్సెస్‌ అయ్యాడెమో అనిపిస్తుంది. ప్రేమ, ఫెయిల్యూర్, లైఫ్, ఎమోషన్‌.. .వంటి అంశాలను చక్కగా బ్యాలెన్స్‌ చేశాడు దర్శకుడు.

Malayalam movie SarvamMaya Telugu Review jioHotStar

గిరాటిస్ట్‌ కావాలని హీరో తపన పడటం, అతనికి ఈ దెయ్యం హెల్ప్‌ చేస్తుండటం, ఈ క్రమంలో ఆ దెయ్యం గురించి నిజాలు తెలుస్తుండటం వంటి సీన్స్‌తో సినిమా సాఫీగా సాగిపోతుంటుంది. సెకండాఫ్‌లో వచ్చే దెయ్యం తాలుకూ ఎమోషన్‌ కూడా బాగా అనిపిస్తుంది. కానీ సినిమా కాస్త స్లోగా సాగుతుంది. హీరోకి దెయ్యం హెల్ప్‌ చేసే సీన్స్‌ రిపీ టెడ్‌గా రావడం కాస్త ఇబ్బందే. సెకండాఫ్‌లో వచ్చే సాధ్య ట్రాక్‌ కూడా రోటీన్‌ గానే ఉంటుంది. క్లైమాక్స్‌ ఎమోషనల్‌గా ఉంది. ఫాదర్‌ అండ్‌ సన్‌ ఎమోషనల్‌ ట్రాక్‌ను ఇంకాస్త ఎక్స్‌ప్లోర్‌ చేసి ఉండాల్సింది. తెలుగులో ‘సోగ్గాడే చిన్ని నాయానా’ తరహా సినిమాలు గొర్తొస్తాయి.

నటీనటుల పెర్ఫార్మెన్స్‌

ప్రభేందు పాత్రలో నివిన్‌ పౌలి నటన బాగుంది. ఎమోషన్, జీవితంలో సెటిల్‌ అవ్వడం కోసం తాపత్రయ పడే కుర్రాడు, దెయ్యం ట్రాప్‌లో చిక్కుకున్న వ్యక్తి…ఇలా డిఫరేంట్‌ వేరియన్స్‌ ఉన్న పాత్రలో బాగానే నటిం చాడు. ఎమోషనల్‌ సీన్స్‌లోనూ పర్వాలేదనిపించాడు. కథలోకి కాస్త లేట్‌గా వచ్చిన డిలులు దెయ్యంగా ఆలియాస్‌ మాయ మాథ్యాగా రియా శిబు ఈ సినిమాకు మేజర్‌ హైలైట్‌. సూపర్భ్‌ పెర్ఫార్మెన్స్‌ ఇచ్చారు. హీరోతో పాటుగా సమానమైన ఇంపార్టెన్స్‌ ఉన్న రోల్‌ చేశారు. సెకండాఫ్‌లో వచ్చే సాధ్యగా ప్రీతిముకుందన్‌ ఉన్నంతలో మెప్పించారు. రూపేష్‌గా అజువర్గీస్‌ ఈ సినిమాకు మరో ప్లస్‌ పాయింట్‌. కామెడీ బాధ్యతను తీసుకున్నట్లుగా ఈ పాత్ర ఉంటుంది. ప్రభేందు పెదనాన్నగా జనార్థన్, తండ్రిగా రఘునాథ్‌ పలేరి, అన్న య్యగా మధువారియర్‌ యాక్ట్‌ చేశారు. మాయా మాథ్య తండ్రిగా వినీత్, యానీగా మిథిల్‌ దేవిక నటిం చారు. జస్టిన్‌ ప్రభాకరన్‌ మ్యూజిక్, ఆర్‌ఆర్‌ బాగుంది. దర్శకుడు కూడా ఎడిటింగ్‌లో భాగమైయ్యాడు కనక కొన్ని సీన్స్‌ను తొలగించడానికి మనసు ఒప్పుకోలేదెమో. కాస్త కట్‌ చేయవచ్చు. ఉదాహరణకు టీనేజ్‌ కుర్రాళ్లట్రాక్‌. కెమెరా వర్క్‌ బాగుంది.

ఫైనల్‌గా..రోటీన్‌ సూపర్‌నేచురల్‌ థ్రిల్లర్‌ సినిమాలకు పూర్తిగా భిన్నమైన సినిమా ఇది. లైఫ్‌లెసన్స్, కామెడీ, కష్టం, ఎమోషన్, లవ్‌..ఇలా అన్ని అంశాల మేళవింపు ఈ సినిమాలో ఉంటుంది. కొంచెం సాగదీతగా అనిపించినా, బోర్‌ కొట్టదు. ఓ సారి హ్యాపీగా చూడొచ్చు.

 

Please Share
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi