వారణాసి రిలీజ్‌ డేట్‌పై రాజమౌళి మౌనం ఎందుకు?

Viswa
2 Min Read

Web Stories

Varanasi Movie Release date: ‘వారణాసి’ సినిమా అప్‌డేట్స్‌ కోసం భారతీయ సినిమా లవర్స్‌ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో మహేశ్‌బాబు హీరోగా నటిస్తుండం, రాజమౌళి డైరెక్ట్‌ చేస్తుండటమే ఇందుకు కారణం. పైగా ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియాంకా చోప్రా, మలయాళ దర్శక–నిర్మాత, నటుడు పృథ్వీరాజ్‌సుకుమారన్‌ విలన్‌ రోల్‌ చేస్తున్నారు. ఇంత పెద్ద, మంచి స్టార్‌కాస్ట్‌ ఉన్న సినిమాపై ఆడియన్స్‌ ఎందుకు అంచనాలు లేకుండా ఉంటాయ్‌..కచ్చితంగా ఉంటాయ్‌. రెట్టింపు అంచనాలే ఉంటాయ్‌.

‘వారణాసి’ సినిమా 2027 వేసవిలో రిలీజ్‌ కానుందని ఆల్రెడీ మేకర్స్‌ ప్రకటించారు. కానీ ఈ సినిమా విడు దల తేదీపై ఇప్పటివరకు సరైన స్పష్టత లేదు. సడన్‌గా..ఈ ‘వారణాసి’ సినిమా ఏప్రిల్‌ 7, 2027న (Varanasi Movie Release date) రిలీ జ్‌ కానుందనే టాక్‌ తెరపైకి వచ్చింది. కాశీలో 7ఏప్రిల్, 2027న థియేటర్స్‌లో విడుదల..అంటూ హోర్డింగ్స్‌ కనిపించడమే, ఇందుకు కారణం. అలాగే ఈ సినిమా బ్యాక్‌డ్రాప్‌ కూడా కాశీనగరమే. దీంతో నేషనల్, లోకల్‌ అండ్‌ ఇంటర్‌నేషనల్‌ మీడియా అంటూ తేడాల్లేకుండా విదేశీ మీడియా సైతం ‘వారణాసి’ సినిమా రిలీజ్‌ డేట్‌ 7 2027 అనే వార్తలు రాశారు (Varanasi Movie new Release date)

MaheshBabu Varanasi Movie First look

రిలీజ్‌ డేట్‌ వంటి పెద్ద విషయంపై నేషనల్, ఇంటర్‌నేషనల్‌ మీడియాలో ఈ స్థాయిలో వార్తలు వస్తు న్నప్పటికీని, రాజమౌళి అండ్‌ టీమ్‌ మాత్రం సైలెంట్‌గా ఉన్నారు. ‘వారణాసి’ టీమ్‌ యూనిట్‌ ఎవరూ… 7 ఏప్రిల్‌ 2027…అనేది ‘వారణాసి’ సినిమా రిలీజ్‌ డేట్‌ అంటూ వారి సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌లో ఎక్కడా ప్రకటించలేదు. ఈ సినిమా టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ వీడియో కోసమే, ఓ భారీ ఈవెంట్‌ను నిర్వహించి, ఈ ఈవెంట్‌ పబ్లిసిటీ కోసం సోషల్‌మీడియాలో చాటింగ్‌ చేసిన రాజమౌళి,మహేశ్‌బాబులు ఇప్పుడు రిలీజ్‌ డేట్‌ విషయంలో ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు అనేది ఫిల్మ్‌నగర్‌లో చర్చనీయాంశమైంది.

పబ్లిసిటీలో మాస్టర్‌ రాజమౌళిజ తన సినిమా రిలీజ్‌ డేట్‌ విషయంలో ఇంతమౌనంగా ఎందుకు ఉన్నారు? పైగా ఇంత పెద్ద సినిమాకు ఆయన తనయుడు కార్తికేయ ఓ ప్రొడ్యూసర్‌. అంటే..ఓ రకంగా ఈ సినిమాకు రాజమౌళికూడా నిర్మాతే. మరి..‘వారణాసి’ రిలీజ్‌ డేట్‌ విషయంలో జక్కన్న మౌనం ఎందుకు అనేది? తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. మహేశ్‌బాబు–ప్రియాంకా చోప్రాలు పాల్గొంటుండగా, కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్‌. ఇక ఈ ‘వారణాసి’ సినిమాకు కేఎల్‌ నారాయణ మరో నిర్మాతగా ఉండగా, ఎమ్‌ఎమ్‌ కీరవాణి మ్యూజిక్‌ అందిస్తున్నారు. ప్రకాష్‌రాజ్‌ మరో కీ రోల్‌ చేస్తున్నాడు.

Please Share
Share This Article
136 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu