జోర్డాన్ లో ‘డ్రాగన్’ షూటింగ్.. భారీ యాక్షన్ సీన్స్ తీసున్న ప్రశాంత్ నీల్!

Kumar NA

Web Stories

NTR :యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాస్ సినిమాల స్పెషలిస్ట్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ పాన్-ఇండియా చిత్రం ఇప్పుడు విదేశీ గడ్డపై సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన సమాచారం ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కీలక షెడ్యూల్ నేడు (పిబ్రవరి 5 న) జోర్డాన్ దేశంలో ప్రారంభం అయింది. ఈ షెడ్యూల్ కోసం మూడు రోజుల క్రిందటే ఎన్టీఆర్ జోర్డాన్ చేరుకున్నాడు.

అక్కడి వాతావరణ పరిస్థితులకు అలవాటు పడటంతో పాటు, తన కొత్త లుక్, మేకోవర్‌ను ఫైనలైజ్ చేసేందుకు తారక్ ముందే అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది. జోర్డన్ ఎడారి ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుంది. అటు జోర్డాన్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ పట్ల ప్రత్యేక ఆసక్తిని కనబరిచింది. షూటింగ్ సాఫీగా సాగేందుకు అవసరమైన పూర్తి సహకారాన్ని, భద్రతాపరమైన భరోసాను అక్కడి అధికార యంత్రాంగం కల్పించడం విశేషం.

ఈ షెడ్యూల్‌లో ప్రశాంత్ నీల్ మార్క్ హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఇవి సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ‘దేవర’ వంటి భారీ విజయం తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడం, అలాగే ‘సలార్’ తర్వాత నీల్ డైరెక్ట్ చేస్తున్న మూవీ కావడంతో.. ఈ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ రికార్డులను తిరగరాస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.2026 సెకండాఫ్ లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos