please subscribe to Tollywoodhub YouTube channel

అల్లు అర్జున్ కి సారీ చెప్పిన కావేరి బారువా..!

Kumar NA

Web Stories

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ఇంటర్వ్యూ నిబంధనలపై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చకు ఎట్టకేలకు తెరపడింది. బన్నీ టీమ్ 42 కండిషన్లు పెట్టిందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన కావేరీ బారువా, తన తప్పును తెలుసుకొని బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న కావేరీ బారువా, అల్లు అర్జున్‌ను ఇంటర్వ్యూ చేయాలంటే ఆయన టీమ్ ఒక పెద్ద నిబంధనల పత్రాన్ని (42 రూల్స్) పంపిస్తుందని వ్యాఖ్యానించారు. ఈ క్లిప్ నెట్టింట వైరల్ కావడంతో బన్నీ పీఆర్ టీమ్ వెంటనే స్పందించి, అది పచ్చి అబద్ధమని కొట్టిపారేసింది. అయినప్పటికీ, సోషల్ మీడియాలో కొన్ని నకిలీ నిబంధనల పత్రాలు చక్కర్లు కొట్టడంతో వివాదం ముదిరింది.

పరిస్థితి తీవ్రతను గమనించిన కావేరీ బారువా, తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘ వివరణ ఇస్తూ బన్నీకి క్షమాపణలు కోరారు. అల్లు అర్జున్ కానీ, ఆయన టీమ్ కానీ తనకు ఎటువంటి నిబంధనల పత్రాన్ని ఇవ్వలేదని ఆమె స్పష్టం చేశారు. పాడ్‌కాస్ట్ సంభాషణలో భాగంగా ఎటువంటి ఆధారాలు లేకుండా, ధృవీకరించుకోకుండా ఆ వ్యాఖ్యలు చేశానని, అది తన పొరపాటేనని అంగీకరించారు. తన మాటల వల్ల అల్లు అర్జున్ ప్రతిష్ఠకు భంగం కలిగినా, అపార్థాలు చోటుచేసుకున్నా హృదయపూర్వకంగా చింతిస్తున్నానని, ఆ వ్యాఖ్యలను పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నానని తెలిపారు. అల్లు అర్జున్ సినీ ప్రస్థానం పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని, తన వల్ల కలిగిన అసౌకర్యానికి క్షమించమని ఆమె కోరారు. కావేరీ బారువాతో పాటు, సదరు పాడ్‌కాస్ట్‌ను నిర్వహించిన స్వీకృతి కూడా ఈ వివాదంపై స్పందిస్తూ విచారం వ్యక్తం చేశారు.

ఇద్దరూ వేర్వేరుగా క్షమాపణలు చెప్పడంతో ఈ వివాదం ముగిసినట్లయింది. వాస్తవాలు తెలుసుకోకుండా చేసే వ్యాఖ్యలు సెలబ్రిటీల వ్యక్తిత్వాన్ని ఎలా దెబ్బతీస్తాయో ఈ ఘటన మరోసారి నిరూపించింది.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi