please subscribe to Tollywoodhub YouTube channel

లెనిన్‌ వాయిదా…పెద్దినే కారణమట..

Viswa

Web Stories

Akhil Lenin Movie: ఏజెంట్‌ వంటి డిజాస్టర్‌ మూవీ తర్వాత హీరో అఖిల్‌ యాక్ట్‌ చేస్తున్న లేటెస్ట్‌ మూవీ ‘లెనిన్‌’ (Akhil Lenin Movie). ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్‌ మురళీ క్రిష్ణ అబ్బూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తు న్నారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీభోర్సే హీరోయిన్‌. సూర్యదేవర నాగవంశీ, నాగార్జున నిర్మిస్తున్న సినిమా ఇది. ఈ ఏడాది మే 1న ఈ సినిమాను రిలీజ్‌ చేయనున్నట్లుగా ఆల్రెడీ ఇదివరకే మేకర్స్‌ ప్రకటించారు. కానీ ‘లెనిన్‌’ సినిమా విడుదల వాయిదా పడింది. లెనిన్‌ సినిమాను జూన్‌ 26న రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు.

ఇందుకు కారణాన్ని కూడ లెనిన్‌ టీమ్‌ స్పష్టం చేసింది. రామ్‌చరణ్‌ ‘పెద్ది’ సినిమా ఏప్రిల్‌ 30న రిలీజ్‌ అవుతున్న నేపథ్యంలో, లెనిన్‌ సినిమాను జూన్‌ 26కు వాయిదా వేసినట్లుగా టీమ్‌ తెలిపింది. రామ్‌చరణ్‌,అఖిల్‌గార్ల మధ్య మంచి సోదరభావం ఉందని, అలాగే మనందరం కలిసి సిని మాలను సెలబ్రేట్‌ చేసుకోవాలనే ఓ సానుకూల ధోరణితోనే ‘లెనిన్‌’ సినిమాను వా యిదా వేసినట్లుగా లెనిన్‌’ టీమ్‌ పేర్కొంది. అలాగే ‘లెనిన్‌’ సినిమా విడుదలైన రోజున..వెండితెరపై సినిమాను సెలబ్రేట్‌ చేసుకునేలా ఉంటుందని కూడా ‘లెనిన్‌’ టీమ్‌ తెలిపింది.

రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యాక్షన్‌ లవ్‌స్టోరీ సినిమా లెనిన్‌. ఇందులో అఖిల్‌ ఫాదర్‌గా ఓ పాపులర్‌ సీనియర్‌ స్టార్‌ హీరో నటిస్తున్నారని తెలిసింది. లెనిన్‌ సినిమాలో హీరోయిన్‌గా తొలుత శ్రీలీలను అనుకున్నారు. కొంత షూటింగ్‌ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె, ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో, ఈ ప్లేస్‌లోకి భాగ్య శ్రీ భోర్సే వచ్చారని తెలుస్తోంది.

సూడ్మే…ఆటే నా పొగరు

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi