please subscribe to Tollywoodhub YouTube channel

Chiranjeevi Viswambhara Budget: విశ్వంభరపై మరింత భారం?

Chiranjeevi Viswambhara Budget: విశ్వంభర బడ్జెట్‌ అనుకున్నదాని కంటే ఎక్కువ అవుతుందనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది

Viswa
2 Min Read
Chiranjeevi Vishwambhara Release date

Web Stories

చిరంజీవి లేటెస్ట్‌ మూవీ ‘విశ్వంభర (Chiranjeevi Viswambhara Budget)’. ఈ సోషియో ఫాంటసీ యాక్షన్‌ అడ్వెంచరస్‌ థ్రిల్లర్‌ మూవీని యూవీ క్రియేషన్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ట ఈ సినిమాకు దర్శకుడు. ఈ ఏడాది జనవరి 10న ఈ మూవీ రిలీజ్‌ కావాల్సింది. కానీ విడుదలైన ‘విశ్వంభర’ టీజర్‌ గ్రాఫిక్స్, విజువల్స్‌పై నెగటివ్‌ టాక్‌ రావడం, గేమ్‌చేంజర్‌ రిలీజ్‌ తదితర అంశాల కారణంగా ‘విశ్వంభర’ రిలీజ్‌ వాయిదా పడింది.

75 కోట్ల రూపాయాల గ్రాఫిక్స్‌

ఇంద్ర సినిమా రిలీజైన జూన్‌ 24న విశ్వంభర సినిమాను రిలీజ్‌ చేద్దామనుకుంటుననారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ…‘విశ్వంభర (Chiranjeevi Viswambhara)  సినిమా గ్రాఫిక్స్‌ కోసం టీమ్‌ భారీ మొత్తం ఖర్చు పెడుతుంది. ఈ సినిమా గ్రాఫిక్స్‌ కోసమే…రూ. 75 కోట్ల రూపాయాలు ఖర్చు పెడుతున్నారు మేకర్స్‌. ఇటీవల కొంత రీ షూట్‌ కూడా జరిగింది. ఇదంత అదనపు వ్యయమే.

124

ఆరు కోట్ల పాట

పైగా ఈ మూవీలో త్రిష వంటి స్టార్‌ హీరోయిన్‌ కూడా ఉంది. రెమ్యూనరేషన్‌ విషయంలో త్రిష రాజీ ఉండ దు. ఆషికా రంగనాథ్‌ మరో హీరోయిన్‌ గా చేస్తున్నారు. ఈ మూవీలో సిస్టర్‌ సెంటిమెంట్‌ బలంగా ఉందట. సో..చిరంజీవి చెల్లెలి పాత్రల కోసమ మరో నలుగురైదుగురు మీడియం రేంజ్‌ హీరోయిన్స్‌ ఉన్నారని తెలి సింది. ప్రవీణ్, రాజీవ్‌కనకాల, బాలీవుడ్‌ నుంచి కునాల్‌ కపూర్‌..ఇలా ‘విశ్వంభర’ సినిమాలో భారీ తారా గణమే ఉన్నారు. కీరవాణి స్వరకర్త. ఇంకా బలమైన టెక్నికల్‌ టీమ్‌ కూడా ఉంది. భారీ సెట్స్‌ వేశారు. రీసెంట్‌గా ‘విశ్వంభర’ సినిమా నుంచి వచ్చిన ‘రామ రామ’ పాటకు ఆరుకోట్లు ఖర్చు అయ్యిందట. మరో స్పెషల్‌ సాంగ్‌ తీయాల్సి ఉంది. స్పెషల్‌ సాంగ్‌..స్పెషల్‌ హీరోయిన్‌కు స్పెషల్‌గా అమౌంట్‌ ఇచ్చు కోవాలి…ఇవన్నీ చూసుకుంటే…‘విశ్వంభర’ సినిమా బడ్జెట్‌ దాదాపు రూ. 150 కోట్ల మించి ఉండేలా ఉంది.

ప్రస్తుతం ఇండియన్‌ సినిమా అంతా ‘పుష్ప, దేవర, సలార్‌’ వంటి యాక్షన్‌ సినిమాల హవా నడుస్తోంది లేదా..‘స్త్రీ 2, భూల్‌భూలయ్యా 3’ వంటి హారర్‌ మూవీ ట్రెండ్‌ కనిపిస్తోంది. మరి…విశ్వంభర లాంటి సోషియో ఫ్యాంటసీ మూవీ ఆడియన్స్‌కు ఎలా కనెక్ట్‌ అవుతుందో చూడాలి. పైగా దర్శకుడు వశిష్ఠకు ఇది రెండో సినిమాయే. ఇవన్నీ చూసుకుంటే..విశ్వంభర సినిమాకు ఓవర్‌ బడ్జెట్‌ అవుతుందనే టాక్‌ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

సోషియో ఫ్యాంటసీ జానర్‌లో చిరంజీవికి ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ వంటి సూపర్‌డూపర్‌ సినిమా ఉంది. అలాగే ‘అంజి’ వంటి ప్లాప్‌ మూవీ కూడా ఉంది. మరి…విశ్వంభర రిజల్ట్‌ ఏమౌతుందో చూడాలి.

Please Share
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi