కర …బ్యాంకు దొంగతనం

Viswa
1 Min Read

Web Stories

Dhanush Kara telugu Trailer: ధనుష్‌ హీరోగా విఘ్నేష్‌ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ‘కర’ సినిమా (Kara Movie)  ఈ నెల 30న (Kara Movie Release date) థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. ఈ చిత్రంలో మమితాబైజు హీరోయిన్‌గా నటించగా, కె.ఎస్. రవికుమార్, కరుణాస్, జయరామ్, పృథ్వీ పాండియరాజన్, సూరజ్ వెంజరమూడు, ఎం.ఎస్. బాస్కర్, శ్రీజ రవిలు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. కుష్మితా గణేష్‌ సమర్పణలోఇషారి. కె. గణేష్‌ నిర్మించారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ‘కర’సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు.

ఇందులో కరసామీ పాత్రలో ధనుష్‌ నటించారు. 1990-1991 నేపథ్యంతో రూపొందిన పీరియాడికల్‌ సినిమా ఇది. కర బ్యాంకుల్లో దొంగతనం చేయడం, డబ్బు కోసం ఏదైనా చేయడం, దొంగతనాల గురించి పోలీసులకు తెలిసినా, కర దొంగతనాలు ఆపకపోవడం..వంటి విజువల్స్‌తో ‘కర’ సినిమా ట్రైలర్‌ సాగుతుంది. ఇందులో ధనుష్‌ తండ్రి పాత్రలో కేఎస్‌ రవికుమార్‌ నటించారు. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం సాగుతుంది.

 

Please Share
Share This Article
109 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu