KiranAbbavaraam Interview: సింపతీతో సినిమాలు ఆడవు…ఆ సినిమాను మూడు పార్టులుగా తీస్తా

KiranAbbavaraam Interview: 'క' సినిమా తర్వాత హీరో కిరణ్‌ అబ్బవరం హీరోగా చేసిన 'దిల్‌ రుబా' సినిమా మార్చి 14న రిలీజ్‌ అవుతోంది. ఈ సందర్భంగా కిరణ్‌ అబ్బవరం ఇంటర్వ్యూ

Viswa
2 Min Read
Hero Kiran Abbavaraam

KiranAbbavaraam Interview: ‘క’ సినిమా సూపర్‌హిట్‌ కావడంతో, ఈ చిత్రం హీరో కిరణ్‌ అబ్బవరం (KiranAbbavaraam Interview) నుంచి రాబోతున్న నెక్ట్స్‌ మూవీ ‘దిల్‌ రుబా’ పై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రం ఈ నెల 14న థియేటర్స్‌లోకి రానుంది. విశ్వకరుణ్‌ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. ఈ సందర్భంగా ‘దిల్‌ రుబా’ సినిమా కథ గురించి, ‘క’ సినిమా సక్సెస్‌ను గురించి కొన్ని విషయాలను పంచుకున్నారు కిరణ్‌ అబ్బవరం. ఆ విశేషాలు…

‘దిల్‌ రుబా’ కథ ఇదే!

‘దిల్‌ రుబా’ క్యారెక్టర్‌ డ్రివెన్‌ ఫిల్మ్‌. హీరోకి ఊరికే ‘సారీ, థ్యాంక్స్‌’లు చెప్పడం ఇష్టం ఉండదు. అలా హీరో ఓ సందర్భంగా సారీ చెప్పకపోవడం వల్ల, అతని చుట్టుపక్కల వారు ఎలా ఎఫెక్ట్‌ అయ్యారు అన్నదే కథ. పెద్ద ట్విస్ట్‌లు, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ఉన్న స్టోరీ అయితే కాదు. న్యూ ఏజ్‌ కమర్షియల్‌ ఫిల్మ్‌. ఫ్యామిలీ ఆడియన్స్‌ హాయిగా చూడొచ్చు.

హీరో ఏ కారణాల చేత ఊరికే ‘సారీ, థ్యాంక్స్‌’లు చెప్పకూడదు అని అనుకుంటాడు? హీరో మాజీ ప్రేమికురాలు వచ్చి, అతని ప్రస్తుత ప్రేమను గెలిపిస్తే ఎలా ఉంటుంది? అన్నదే స్టోరీ. సింపుల్‌గా చెప్పా లంటే…ఓ అబ్బాయికి అతని మాజీ ప్రేయసి, ఓ కేర్‌ టేకర్‌లా ఉంటే ఏలా ఉంటుంది? అన్నదే స్టోరీ లైన్‌.

అప్పుడు నేను పది గంటలు ఏడుస్తా..!

‘క’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో నేను ఎమోషనల్‌గా మాట్లాడటం వల్లే…ఆ సినిమా ఆడిందనడంలో అర్థం లేదు. ఓ హీరో అరగంట మైకు పట్టుకుని ఏడిస్తే…సినిమా హిట్‌ అవుతుందని అంటే…నేను పది గంటలు ఏడుస్తా. ‘క’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో నేను మాట్లాడిన కొన్ని మాటలు ఎమోషనల్‌గా ఉండి ఉండొ చ్చు. వీటికి ఆడియన్స్‌ కనెక్ట్‌ అయితే..మార్నింగ్‌షో చూస్తారు. అంతే…కానీ సినిమా హిట్‌ కావలంటే అం దులో కంటెంట్‌ ఉండాలి. ‘క’ సినిమాలో కంటెంట్‌ ఉంది కాబట్టే విజయం సాధించింది. కానీ… మా అమ్మ గురించి మాట్లాడితే…సింపతీ కోసం అంటున్నారు. ఇలాంటివి చూస్తుంటే…భవిష్యత్‌ నా అన్న వాళ్లు గురించి మనస్ఫూర్తిగా ఏం మాట్లాడలేనెమో నని అనిపిస్తోంది. అయినా..సింపతీతో సినిమాలు ఆడవు.

– నా నుంచి నా నెక్ట్స్‌ మూవీ ‘కె ర్యాంపు’ విడుదల అవుతుంది. మరో నాలుగు కథలు ఒకే చేశాను. ఇందు లో లంకె బిందిల నేపథ్యంతో ఓ మూవీ ఉంది. ఈ సినిమాను మూడు పార్టులుగా తీసే ఆలోచన చేస్తున్నాం. ఈ సినిమాల అధికారిక ప్రకటనలు త్వరలోనే వెల్లడవుతాయి.

 

 

 

 

Please Share
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *